twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇది దారుణం: యాక్టర్లను ఇష్టపడేది ప్రతిభ ఆధారంగానా? సెక్స్ లైఫ్ ఆధారంగానా?

    బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ వివేక్ అగ్నిహోత్రి ట్విట్టర్లో చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది.

    By Bojja Kumar
    |

    అమెరికన్ యాక్టర్ కెవిన్ స్పేసీ మీద వెల్లువెత్తుతున్న సెక్సువల్ ఆరోపణల నేపథ్యంలో.... బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్ వివేక్ అగ్నిహోత్రి సంచలన కామెంట్స్ చేశారు. ఒక మంచి నటుడు మంచి వ్యక్తిగా ఉండాలని ఎందుకు కోరుకుంటారు? అంటూ ప్రశ్నించారు.

    నటీనటులను మనం ప్రేమించేది వారి నటనను చూసా? లేక వారి సెక్సువల్ లైఫ్ ను చూశా? ఎందుకు ఒక మంచి నటుడు మంచి వ్యక్తి అవ్వాలని కోరుకుంటారు? అతడు మంచి నటుడు అయినంత మాత్రాన మంచి వ్యక్తి కూడా అవ్వాలని రూల్ ఏమీ లేదంటూ వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ చేశారు.

     వివేక్ అగ్ని‌హోత్రి కామెంట్స్ వెనక కారణం ఏమిటి?

    వివేక్ అగ్ని‌హోత్రి కామెంట్స్ వెనక కారణం ఏమిటి?

    అమెరికన్ యాక్టర్ కెవిన్ స్పేసీ ప్రముఖ నటుడిగా పేరుగాంచాడు. అయితే అతడిపై కొన్ని సెక్సువల్ ఆరోపణలు వెల్లువెత్తడంతో నెట్‌ఫిక్స్ సంస్థ అతడు ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ పొలిటికల్ డ్రామా "హౌస్ ఆఫ్ కార్డ్స్' కార్యక్రమాన్ని ముగించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో అగ్నిహోత్రి పై విధంగా స్పందించారు.

     ఇది చాలా దారుణం అంటున్న వివేక్ అగ్నిహోత్రి

    ఇది చాలా దారుణం అంటున్న వివేక్ అగ్నిహోత్రి

    ఒక మంచి నటుడిని కేవలం మంచి నటుడిగానే చూడాలి. అతడి వ్యక్తి గత జీవితానికి, అతడి ప్రతిభకు లింకు పెట్టొద్దని... ఈ విధంగా అతడు నటించిన ప్రోగ్రామ్స్ నిలిపి వేయడం సరైంది కాదు, ఇలా చేయడం దారుణం అని వివేక్ అగ్రిహోత్రి అభిప్రాయం.

     కెవిన్ స్పేసీ మీద ఆరోపణలు ఏమిటి?

    కెవిన్ స్పేసీ మీద ఆరోపణలు ఏమిటి?

    కెవిన్ స్పేసీ మీద సెక్సువల్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతడు ఒక గే అని, మైనర్లు అయిన కుర్రాళ్లతో బలవంతంగా సెక్స్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అమెరికాలో కెవిన్ స్పేసీ వ్యవహారం ఇపుడు అత్యంత వివాదాస్పద అంశంగా మారింది.

     ఆంటోనీ రాప్ ఆరోపణ

    ఆంటోనీ రాప్ ఆరోపణ

    స్టార్ ట్రెక్ యాక్టర్ ఆంటోనీ రాప్.... కెవిన్ స్పేసీ మీద ఆరోపణలు చేశారు. కెవిన్ స్పేసీ వయసు 26 సంవత్సరాలున్నపుడు తన వయసు 14 సంవత్సరాలని. ఆ సమయంలో కెవిన్ స్పేసీ ఓసారి తనతో సెక్స్ చేయడానికి ప్రయత్నించాడని, అతడి నుండి తాను తప్పించుకున్నానని తెలిపారు.

    English summary
    In the wake of the sexual allegations made against American actor Kevin Spacey, filmmaker Vivek Agnihotri has questioned why is it believed that a good actor has to be a good man. "Do we love actors for their performances or their sex life? Why is it believed that a good actor ought to be a good man," tweeted Agnihotri.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X