టాటూ కోసం బాయ్ ప్రెండ్‌ని వదిలేసిన హీరోయిన్
లండన్: టాటూ అంటే తెలుగులో మనం పల్లెటూర్లలో చిన్నప్పుడు వేయించుకునే పచ్చబోట్టు లాంటిదన్నమాట. కానీ టాటూ అనేది ఇప్పుడు చాలా పెద్ద ప్యాషన్ అయిపోయింది. ఒక్కసారి మనం మన శరీరం మీద టాటూ వేయించుకుంటే కొన్ని రకాల టాటూలు చెరిగిపోతాయి, మరికొన్ని రకాల టాటూలు చెరిగిపోవు. హాలీవుడ్లో ఈ టాటూపై ఓ స్టార్ హీరోయిన్ అతనికి కాబోయే భర్తతో గొడవకు దిగింది. తన ఒంటిపై ఉన్న టాటూని అతను తీసివేయమనగా దానిని ఆమె తీసివేయనని ససేమేరా అంది. అంతేకాదండోయ్ అతనితో తన సంబంధాలనుకూడా తెగతెంపులు చేసుకుంది.
ఇంతకీ ఎవరా హీరోయిన్ అని అనుకుంటున్నారా... రియాలిటీ టివి స్టార్ హీరోయిన్ క్యాట్ వాన్ డి తన శరీరంపై ఓ పేరుని టాటూగా వేయించుకుంది. ఆ టాటూని తీసివేయాల్సిందిగా తనకి కాబోయే భర్త జెస్సీ జేమ్స్ కోరగా అందుకు ఆమె తిరస్కరించింది. అందుకు గల కారణాలను వివరిస్తూ తన చిన్నతనంలో ఆ టాటూని తాను ఎంతో ఇష్టపడి వేయించుకోవడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ టాటూ నాకు అంటే ప్రాణం. అందులో చాలా అర్ధం దాగి ఉంది. అలాంటి టాటూని అతను తీసివేయమనడంతో నాకు చాలా భాద వేసింది.
అందుకే ఈ నెల చివరలో మా నిశ్చితార్దం జరగాల్సి ఉన్నా ఆ టాటూ విషయం మీద ఇద్దరం గొడవపడడం, విడిపోవడం జరిగిందని 29 సంవత్సరాల వయుసున్న క్యాట్ వాన్ డి తెలిపింది. ఇంతకీ ఈ జెస్సీ జేమ్స్ ఎవరనుకుంటున్నారా ఆస్కార్ అవార్డ్ విన్నర్ హీరోయిన్ సాంద్రా బుల్లక్ మాజీ భర్తే. సాంద్రా బుల్లక్‌కి, జెస్సీ జేమ్స్‌కి కొన్ని అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోవడం జరిగింది. సాంద్రా బుల్లక్ నుండి జెస్సీ జేమ్స్ విడుపోయిన తర్వాత క్యాట్ వాన్ డితో రోమాన్స్ చేయడం ప్రారంభించాడు. ఈ రోమాన్స్ కాస్త నిశ్చితార్దం వరకు వచ్చి, చిన్న టాటూ గొడవతో ఇద్దరూ విడిపోయారు.


Click it and Unblock the Notifications











