పగలు, రాత్రి తేడా లేకుండా 10 భోజనాలు లాగించేస్తున్నా..!
లాస్ ఏంజిల్స్, జూన్ 25: హాలీవుడ్ యాక్షన్ హీరో మార్క్ వాల్‌బెర్గ్ తాను త్వరలో నటించనున్న 'పెయిన్ అండ్ గెయిన్' సినిమాలో కండగల వాడిగా కనిపించేందు కోసం ప్రతి రోజూ 10 భోజనాలను లాగించేస్తున్నాడు. దీంతో 41 సంవత్సరాల వయసు కలిగిన ఈ హీరో రోజుకీ 10 భోజనాలు తినలేక ఇబ్బంది పడుతున్నట్లు చెప్పాడు. పెయిన్ అండ్ గెయిన్ సినిమాలో మార్క్ వాల్‌బెర్గ్ బాడీ బిల్డర్ డేనియల్ లుంగో పాత్రను పోషిస్తున్నాడు.
ఈ పాత్ర కోసం కఠోర సాధన చేస్తున్నట్లు తెలిపాడు. ఇందుకోసం గాను 24 గంటలకు ఒక ప్లాన్‌ను సిద్దం చేశాడు. ఈ ప్లాన్ ప్రకారం పగలు రాత్రి తేడా లేకుండా భోజనం చేయడంతో పాటు శరీరం కండలు తిరిగేటట్లు కనిపించడానికి గాను కండరాలకు సంబంధించిన షేక్స్‌ను సేవిస్తున్నాడు. ఈ విషయంపై స్పందించిన మార్క్ మాట్లాడుతూ నేను రోజుకి 10 భోజనాలతో పాటు బరువు పెరిగేందుకు పలు రకాల పానియాలను తీసుకుంటున్నాను.
నాకు సరైన పోషకాహారాన్ని అందించేందుకు గాను జిఎన్‌సి(రిటైల్ చైన్)తో ఒప్పందం కుదుర్చుకున్నాను. ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్న తర్వాత నాకు వర్క్ పెరిగింది. రాత్రి పగలు తేడా తెలియకుండా అర్ద రాత్రి 2 గంటల సమయంలో కూడా భోజనాన్ని తీసుకుంటున్నానని అన్నారు. నాకైతే ఈ బాడీ బిల్డర్ లుక్ నచ్చలేదు. సినిమా వరకు ఐతే ఓకె అని అన్నారు. నాకు ఇంత వరకు నా శరీరాన్ని మార్చాలనే అవగాహాన రాలేదు. కానీ 'పెయిన్ అండ్ గెయిన్' సినిమా కోసం ఇలా చేయడం కొత్త అనుభూతినిస్తుందని చెప్పారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











