»   » కోతి జాతికి, మానవ జాతికి యుద్ధం: ‘వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ (ట్రైలర్ సూపర్)

కోతి జాతికి, మానవ జాతికి యుద్ధం: ‘వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ (ట్రైలర్ సూపర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: కోతి జాతికి, మానవ జాతికి యుద్ధం అనే కాన్సెప్టుతో హాలీవుడ్లో వచ్చిన ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సిరీస్ చిత్రాలు భారీ విజయం సాధించాయి. ఇపుడే ఇదే సీరస్ లో వస్తున్న మరో భారీ చిత్రం 'వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్'.

మాట్ రీవ్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర జులై 14, 2017లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ఆండీ సెర్కిస్, వూడీ హార్రెల్సన్, స్టీవ్ జాన్, జుడీ గ్రీర్, కేరిన్ కొనోవల్, టెర్రీ నోటరీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

2014లో వచ్చిన 'డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' చిత్రానికి ఇది సీక్వెల్. ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ రిబూట్ సిరీస్ లో ఇది మూడవ చిత్రం. గతంలో వచ్చిన రెండు సిరీస్ చిత్రాలు భారీ విజయం సాధించాయి.

గతంలో వచ్చిన చిత్రాలు తెలుగులో కూడా రిలీజ్ అయి మంచి విజయం సాధించాయి. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్, వార్ చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా చూడాలంటే మరో 7 నెలలు ఘాల్సిందే. ఇప్పటికైతే ఈ ట్రైలర్ చూసి సంతృప్తి పడాల్సిందే.

English summary
In War for the Planet of the Apes, the third chapter of the critically acclaimed blockbuster franchise, Caesar and his apes are forced into a deadly conflict with an army of humans led by a ruthless Colonel. After the apes suffer unimaginable losses, Caesar wrestles with his darker instincts and begins his own mythic quest to avenge his kind. As the journey finally brings them face to face, Caesar and the Colonel are pitted against each other in an epic battle that will determine the fate of both their species and the future of the planet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu