మరగుజ్జు కదా.. అని తక్కువగా చూడకండి
హాలీవుడ్‌లో ఎంత మంది గొప్ప హీరోలు ఉన్నప్పటికీ తన నటనా శైలి తనదే. ఇంతకీ ఆ స్పెషల్ హీరో ఎవరని అనుకుంటున్నారా .. చూడడానికి భూమి మీద మూడు అడుగులే అయినప్పటికీ అతను చేసిన యాక్టింగ్‌ని చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. హ్యారీ పోట్టర్ చివరి పార్ట్ చూసిన వారికి అతని గురించి పరిచయం అక్కర లేదు. అతనే వార్విక్ డేవిస్. వార్విక్ డేవిస్ తన ఫ్యామిలీ గురించి ఎప్పుడూ గొప్పగా ఆలోచిస్తూ ఉంటాడు.
అంతేకాదండోయ్ తన ఫ్యామిలీ ఎల్లప్పడూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశ్యంతో లండన్‌లో ఉన్న టెలివిజన్ స్టూడియోస్‌కి తనతో పాటు తన భార్య సమంతా.. 14 సంవత్సరాల వయసు కలిగిన తన కూతురు అన్నాబెల్, ఎనిమిది సంతవ్సరాల వయసు కలిగిన కొడుకు హార్రిసన్‌తో దర్శించడానికి రావడం జరిగింది. ప్రక్క చిత్రంలో ఉన్న ఫోటోని గనుక గమనించినట్లేతే అభిమానులు అడడగానే వార్విక్ డేవిస్ సరదాగా నవ్వుతూ టెలివిజన్ స్టూడియోస్ ముందు ఫోటోకు ఫోజులిచ్చారు.
41 సంవత్సరాల వయసు కలిగిన వార్విక్ డేవిస్ బ్లాక్ షర్ట్ పై భాగాన, బ్లాక్ సూట్‌తో పాటు, బ్లాక్ షూస్‌ని ధరించారు. హాలీవుడ్‌లో ప్రముఖ బజినెస్ మ్యాన్ పీటర్ బురోస్ కూతరైన సమంతా, వార్విక్ డేవిస్‌ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. వార్విక్ డేవిస్ స్వతహాగా ఒక విధమైన వ్యాధి(మరగుజ్జు)తో భాద పడడం వల్ల అతని ఎత్తు కేవలం మూడు అడుగుల 6ఇంచ్‌లుగా ఉన్న విషయం తెలిసిందే. తన వల్లే తన కూతురు, కొడుకు, భార్య కూడా ఇదే వ్యాధి(మరగుజ్జు)తో భాద పడుతున్నప్పటికీ ఆ భాదని మనసులోనే దాచుకొని, ఎప్పుడూ ఆనందంగా కనిపించడం వార్విక్ డేవిస్ ప్రత్యేకత.


Click it and Unblock the Notifications











