twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిజ్రాలంటే నాకిష్టం అంటోన్న హ్యారీపోటర్ హీరోయిన్...

    |

    ఎమ్మా వాట్సన్, అదేనండి హ్యారీ పోటర్ లో ముద్దులొలికే చిన్నారిగా కనిపిస్తూనే, స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయిన ఈ భామ, ఇప్పుడు సెలక్టివ్ సినిమాలు చేస్తూనే, చదువుల్లోనూ చురుగ్గా రాణిస్తోంది. హాలీవుడ్ లో పెద్ద చదువులు చదివిన అతి కొద్దిమంది నటీమణుల్లో అమ్మడి పేరు ముందు వరుసలో ఉంటుందని చెప్పుకోవచ్చు. సాధారణంగా కాంట్రావర్సీలకు దూరంగా ఉండే ఎమ్మా తాజాగా హిజ్రాలకు తన మద్దతును తెలుపుతూ వార్తలకు ఎక్కింది.

    వారిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు

    వారిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు

    ఎమ్మా , ట్రాన్స్ జెండర్ లకు తన మద్దతు తెలుపుతూ ట్విట్టర్ లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. హిజ్రాలకు కూడా సాధారణంగా జీవించే హక్కు ఉందని ట్వీట్ చేసిన ఎమ్మా, వారిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని స్పష్టంచేసింది. తాను ట్రాన్స్ జెండర్లకు ఆర్థిక సహాయం చేస్తున్న పలు సంస్థలకు విరాళాలు అందజేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, వారు ఎలా ఉన్నా, హిజ్రాల పట్ల తనకు ఎంతో గౌరవమర్యాదలు ఉన్నాయని తెలిపింది. వారంటే తనకు ఎంతో అభిమానమని వెల్లడించింది.

    పెద్ద దూమారం రేపిన జేకే రౌలింగ్ ట్వీట్

    పెద్ద దూమారం రేపిన జేకే రౌలింగ్ ట్వీట్

    అసలు ఎమ్మా ఎందుకు ఇలా స్పందించాల్సి వచ్చిందో తెలుసుకోవాంటే, ముందుగా జేకే రౌలింగ్ తెరలేపిన కాంట్రావర్శీపై ఓ లుక్కేయాల్సిందే. హ్యారీ పోటర్ సిరీస్ తో జనాలకు అద్భుత ప్రపంచాన్ని పరిచయం చేసిన జేకే రౌలింగ్.. ఈ మధ్య చేసిన ఓ ట్వీట్ సరికొత్త వివాదానికి తెరలేపింది. ఆమె ట్వీట్, హిజ్రాలకు వ్యతిరేకంగా ఉందంటూ పెద్ద ఎత్తున దుమారం లేచింది.

    రౌలింగ్ కు వ్యతిరేకంగా ఏకమైన హ్యారీపోటర్ టీమ్

    రౌలింగ్ కు వ్యతిరేకంగా ఏకమైన హ్యారీపోటర్ టీమ్

    జేకే రౌలింగ్ ట్వీట్ కు వ్యతిరేకంగా ఇప్పటికే, హ్యారీ పోటర్ కథానాయకుడు డేనియల్ రాడ్ క్లిఫ్ తో పాటూ, అదే సినిమాలో నటించిన పులువురు ట్వీట్ చేశారు. తాము ట్రాన్స్ జెండర్లకు మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అయితే వీరిలో ఎవరూ కూడా, జేకే రౌలింగ్ పేరుగానీ, ఆమె చేసిన ట్వీట్ ను గానీ ప్రస్తావించకపోవడం గమనార్హం.

    English summary
    Emma watson joins the league of Harrypotter's stars, who came out in support of Transgenders, After Famous writer JK Rowling, Harrypotter writer, controversial tweet against Transgender goes viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X