శృంగార రసం ఒలికించిన జెన్నిపర్ లోపెజ్ (వీడియో)

By Bojja Kumar

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ హాట్ బ్యూటీ, పాప్ సింగర్ జెన్నిపర్ లోపెజ్ మరో ఆల్బం విడుదల చేసింది. ఈ సారి ఆస్ట్రేలియన్ బ్యూటీ లెగ్గీ అజెలియాతో కలిసి ‘బూటీ' అనే వీడియో ఆల్బంలో హాట్ అండ్ సెక్సీగా అభిమానులకు అందాల విందు చేసింది. ఈ వీడియో యూట్యూబులో అప్ లోడ్ చేసిన గంటల వ్యధిలోనే లక్షలాది మందిని ఆకర్షిస్తోంది.

జెన్నిపర్ లోపెజ్‌తో పాటు లెగ్గీ అజెలియా బికినీ ధరించి నాలుగు నిమిషాల పాటు శృంగార రసం ఒలికించారు. ఇప్పటి వరకు జెన్నిపర్ లోపెజ్ చేసిన వీడియో ఆల్బమ్స్ అన్నింటికంటే ఈ ఆల్బం సరికొత్తగా, హాట్ హాట్ గా ఉందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. మీరూ జెన్నిపర్ లోపెజ్ అభిమానులైతే ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

Watch Jennifer Lopez's Video For

జెన్నిపెజ్ గురించిన ఇతర వివరాల్లోకి వెళితే..
జెన్నీఫర్ లోపెజ్ జీవితంలో చేసిన తప్పులకు పశ్చాతాప పడుతోంది. ఇప్పటికి ఆమె మూడు వివాహాలు చేసుకుంది. మూడు వివాహాలు పెటాకులయ్యాయి. ప్రియుడు కాస్పెర్ స్మార్ట్ తో ప్రేమాయణం నిశ్చితార్థం వరకు వెళ్లింది. కానీ పెళ్లి కాకుండానే వీరి బంధం పెటాకులైంది. ప్రేమ, పెళ్లి విషయంలో చాలా తప్పులు చేసానని....ప్రస్తుతం తన పిల్లలు తండ్రి లేని వారు కావడం బాధగా ఉందని, వారి జాగ్రత్తగా చూసుకుంటాను అంటోంది జెన్నిఫర్.

తన భర్త మార్క్ ఆంటోనితో విడిపోయిన విషయం తెలిసిందే. వీరు విడిపోయిన దాదాపు మూడేళ్ల అనంతరం కోర్టు నుండి వీరికి విడాకులు మంజూరు అయ్యాయి. వీరికి ఆరేళ్ల వయసున్న కవలలు ఉన్నారు. జెన్నిఫర్ లోపెజ్ సంరక్షణలోనే పిల్లలు ఉంటారు కాబట్టి నెలలో వారంరోజులు ఆంటోని పిల్లలతో గడిపే అవకాశాన్ని కోర్టు కల్పించింది.

కొన్ని రోజుల క్రితం జెన్నిఫర్ లోపెజ్ మాట్లాడుతూ.... తన భర్త మార్క్ ఆంథోని విడిపోవడమే జీవితంలో అత్యంత విషాదకర సంఘటన అని హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపేజ్ అన్నారు. 2012 లో మార్క్ ఆంథోని, లోపెజ్ లు విడిపోయారు. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితం తర్వాత ఆంథోని నుంచి విడాకులు తీసుకున్నారు. అయితే తన భర్త నుంచి విడాకులు తీసుకోవడంపై ప్రస్తుతం లోపెజ్ విచారం వ్యక్తం చేయడం గమనార్హం.

మార్క్ తో విడిపోయాక జీవితం దుర్భరంగా మారింది. ఎన్నడూ లేనంతగా జీవితంలో విషాదం నిండుకుందన్నారు. కొద్దికాలం పాటు ఆఘటన గురించి తలచుకుని బాధపడ్డాను. ప్రస్తుతం రియలైజ్ అవుతున్నాను. లోపెజ్ అన్నారు. కాగా.....ఆంటోని కంటే ముందే జెన్నిఫర్‌కు రెండు పెళ్లిళ్లు అయి విడాకులు అయ్యాయి. ఆంటోనీ ఆమె మూడో భర్త. అతని నుండి విడిపోయినప్పటి నుండి రెండేళ్లగా డాన్సర్ కాస్పర్ స్మార్ట్ తో లోపేజ్ డేటింగ్ చేసింది. ప్రస్తుతం అతను కూడా దూరం అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X