హీరోయిన్ జుట్టు లాగి పబ్లిగ్గా దాడి చేసాడు..! (వీడియో)
పారిస్: అమెరికన్ హాట్ అండ్ సెక్సీ స్టార్ కిమ్ కర్దాషియాన్‌కు పారిస్ ఫ్యాషన్ వీక్‌లో అనుకోని అనుభవం ఎదురైంది. ఆమెపై దాడి జరిగింది. కిమ్ కర్ధాషియాన్ జుట్టు లాగి ఆమెను కింద పడేసే ప్రయత్నం చేసారు. ఈ చర్యకు పాల్పడింది మరెవరో కాదు....సెలబ్రిటీ ఫ్రాంక్‌స్టర్ పేరు తెచ్చుకున్న విటల్లీ సెదుక్ అనే వ్యక్తి. సెప్టెంబర్ 26న పారిస్‌లోని మాల్మేన్స్ ఫ్యాషన్ షోకు హాజరైన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
విటల్నీ సెదుక్ అనే వ్యక్తి సెల్రబిటీ ఫ్రాంక్‌స్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రముఖ హాలీవుడ్ తారలు హాజరయ్యే రెడ్ కార్పెట్ వేడుకలకు వచ్చి....సెలబ్రిటీలపై దాడి చేయడం, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం చేస్తుంటాడు. గతంలో పలు సందర్భాల్లో ఇలాంటి చర్యలకు పాల్పడ్డ విటల్లీ సెదుక్...ఇపుడు కిమ్ కర్ధాషియాన్‌ను టార్గెట్ చేసాడు.
కిమ్ కర్ధాషియాన్ కారు నుండి కిందకి దిగగానే....ఆమె జుట్టు లాగి కింద పడేసే ప్రయత్నం చేసాడు. వెంటనే తేరుకున్న సెక్యూరిటీ సిబ్బంది అతన్ని చితకబాది కిమ్ కర్ధాషియాన్‌ను కాపాడారు. అ సంఘటనతో ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు. విటల్లీ సెదుక్ మాజీ ఉక్రెయిన్ జర్నలిస్టు.
స్లైడ్ షోలో దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియో...

కిమ్ కర్ధాషియాన్‌పై దాడి
కిమ్ కర్ధాషియన్ జుట్టు లాగి కింద పడేసే ప్రయత్నం చేసారు. అయితే వెంటనే తేరుకున్న సెక్యూరిటీ సిబ్బంది ఆమెను కాపాడారు.

దాడి జరిగిన తర్వాత
దాడి జరిగిన తర్వాత భర్త కెన్నీ వెస్ట్‌తో కలిసి వెలుతున్న కిమ్. వెంట ఆమె తల్లి కిమ్ జన్నెర్ కూడా ఉన్నారు.

కిమ్ కర్ధాషియాన్‌పై దాడి చేసిన విటల్లీ సెదుక్
సెల్రబిటీ ఫ్రాంక్‌స్టర్‌గా పేరు తెచ్చుకున్న విటల్లీ సెదుక్ అనే (కళ్ల జోడు పెట్టుకున్న) వ్యక్తి దాడి చేసాడు.

పథకం ప్రకారం...
పతకం ప్రకారం ఆమె జుట్టు లాగి కింద పడేసే ప్రయత్నం చేసాడు. విటల్లీ సెదుక్ మాజీ ఉక్రెయిన్ జర్నలిస్టు. గతంలో పలువురు హాలీవుడ్ సెలబ్రిటీల పట్ల ఇలా ప్రవర్తించాడు.
వీడియో...
కిమ్ కర్ధాషియన్ పై దాడి


Click it and Unblock the Notifications











