twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తల్లిదండ్రులుగా కలిసి పని చేయడానికి కట్టబడి ఉన్నాం

    By Nageswara Rao
    |

    లాస్ ఏంజిల్స్, జులై 10: ఐదు సంవత్సరాలు కలిసి జీవించిన తర్వాత కొన్ని మనస్పర్దల వల్ల తన భర్త హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూయిజ్‌పై క్యాటీ హాల్మస్ విడాకులు కోరుతూ న్యూయార్క్ కోర్టులో ఫైల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంలో క్యాటీ హాల్మస్ తరుపున న్యాయవాది మాట్లాడుతూ టామ్, క్యాటీ విడాకుల వ్యవహారం సెటిల్ అయిందని, ఇక వీరిద్దరి ముద్దుల కూతురు సూరి క్రూయిజ్‌ని ప్రస్తుతానికి క్యాటీ హాల్మస్‌కే కొన్ని షరతులతో.. అప్పగించేటట్లు టామ్ ఒప్పుకున్నారని అన్నారు.

    సూరి క్రూయిజ్ విషయాన్ని వీరిద్దరూ కోర్టు బయటే తేల్చుకోవాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. క్యాటీ లాయర్ జోనాథన్ వోల్ప్ మాట్లాడుతూ టామ్, క్యాటీ విడాకుల వ్వవహారం సెటిల్ అయింది. క్యాటీ ఫ్యామిలీ రాబోయే కాలంలో తన తదుపరి జీవితం ఎలా గడపబోతుందో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుందని చెప్పాడు. త్వరగా విడాకులు తీసుకోవడానికి సహాకరించిన టామ్ క్రూయిజ్ మనసుతత్వం, ప్రోఫెషనలిజం చూస్తుంటే ముచ్చటేసిందని అన్నాడు.

    ప్రస్తుతం సూరి బాగోగులన్ని క్యాటీ హాల్మస్ చూసుకుంటారు, టామ్ ఎప్పుడైనా తన కుమార్తెని కలవాలనుకుంటే నిర్భంధ సమయం పొందవచ్చునని అగ్రిమెంట్లో పేర్కోన్నారు. ఈ అగ్రిమెంట్లో సూరి క్రూయిజ్‌కు సంబంధించిన విషయాలతో పాటు మతపరమైన, సైంటాలజీకి చెందిన విషయాలను పొందుపరచారు. ఈ అగ్రిమెంట్‌లోని ముఖ్యంశాలు...

    ప్రస్తుతం క్యాటీ హాల్మస్ న్యూయార్క్‌లోని ఏదైతే ఇంట్లో నివసిస్తున్నారో అదే ఇంట్లో సూరితో కలిసి ఉండోచ్చు. ఈ ఇంట్లో సూరి క్రూయిజ్ వ్యక్తిగత పనులను పర్యవేక్షించేందుకు నానితో పాటు, ఇంటిని అనుక్షణం రక్షిచేందుకు బాడీ గార్డులు ఉంటారు. ఇక టామ్ క్రూయిజ్ వీక్లీ విక్లీ తన కూతురు సూరి క్రూయిజ్‌ను కలిసేందుకు అనమతినిచ్చారు.

    క్యాటీ హాల్మస్ నెంబర్ వన్ ప్రయారిటీ తన కూతురు 'సూరి క్రూయిజ్'. తన కూతురుతో క్యాటీ హాల్మస్ స్టాఫ్ ఎప్పుడు రక్షణ కవచంలాగా ఉంటారు. అగ్రిమంట్‌లో పైవాటితో పాటు సూరి క్రూయిజ్‌ని మత పరమైన చర్చిలకు, పార్టీలకు టామ్ క్రూయిజ్ అనుమతి క్యాటీ తీసుకోని వెళ్లరాదు. టామ్ క్రూయిజ్, క్యాటీ హాల్మస్ ఇద్దరు కూడా తల్లిదండ్రులుగా కలిసి పని చేయడానికి కట్టబడి ఉన్నారని పేర్కోన్నాడు.

    తెలుగు వన్ఇండియా

    English summary
    Katie Holmes' lawyer has confirmed her highly-publicised divorce with Tom Cruise has been settled, as reports emerge she will have 'sole custody' of their six-year-old daughter Suri.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X