టీనేజ్‌లో ఉన్న జంట లాగే మా బంధం కూడా..?
హాలీవుడ్‌లో తమకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న టీనేజ్ పాప్ సింగర్స్ సెలీనా గోమెజ్, జస్టిన్ బైబర్. గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ కలసి డేటింగ్ చేస్తున్న విషయం యావత్ ప్రపంచానికి తెలుసు. ఐతే ఇటీవల వీరిద్దరి సంబంధం గురించి సెలీనా గోమెజ్‌ని ప్రశ్నించగా గోమెజ్ తనదైన శైలిలో బదులిచ్చారు. టీనేజీలో ఉన్న ఇద్దరి ప్రేమికుల మద్య ఎటువంటి సంబంధమైతే ఉంటుందో అటువంటి సంబంధమే తన బాయ్ ప్రెండ్ జస్టిన్ బైబర్‌తో తనకుందని అన్నారు. అంతే తప్ప మీరంతా అనుకున్నట్లు మా ఇద్దరి మద్య మరేదో సంబంధం లేదని స్ఫష్టం చేశారు.
నేను 19 ఏళ్ల అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుందో అలానే ప్రదర్శిస్తాను. మీరు మమ్మల్ని ప్రేమలో ఉన్నారని అనుకుంటే, మేము ప్రేమలో ఉన్నట్లేనని అన్నారు. అందరి మాదిరే సినిమాలకు వెళ్ళడం అప్పుడప్పడు హ్యాంగ్ ఔట్ అవ్వడం సర్వ సాధారణం అన్నారు. ఐతే కొంత మంది మాత్రం నేను ఏదో తత్వశాస్త్రం చెబుతున్నట్లుగా ఆలోచిస్తుంటారు. ఇటీవలే ఈ జంట హావాయిలోని మాయి బీచ్‌లలో ఎంజాయ్ చేస్తూ కెమెరాకి చిక్కారు. హావాయి బీచ్‌లో ఇద్దరూ ఎంచక్కా ముద్దులతో కేరింతలు కొడుతూ కెమెరా కంట్లో పడ్డారు.
వివరాల ప్రకారం సెలీనా గోమెజ్ పింక్ టూ పీస్ బికనీ ధరించగా, జస్టిన్ బైబర్ మాత్రం పాయింట్ ధరించాడు. వీరిద్దరూ రోజు మొత్తం కలసి హావాయి బీచ్‌లో ఎంజాయ్ చేశారని సమాచారం. అక్కడ వారిద్దరిని చూసిన వారు చెప్పిన మాటల ప్రకారం వీరిద్దరు నీళ్శతో ఆడలాడుకోవడం, జెట్ - స్కై మీద రైడింగ్, పారాసైలింగ్‌తో పైకి ఎగరడం లాంటివి చేశారని అన్నారు. ఒకానోక సందర్బంలో జస్టిన్ బైబర్, సెలీనా గోమెజ్‌ని తన చేతులతో పైకి లేపి ముద్దు కూడా పెట్టుకున్నాడని అన్నారు.
జస్టిన్ బైబర్, సెలీనా గోమెజ్ ఇద్దరూ కూడా వోకేషన్ కోసం మాయికి రావడం నాలుగు నక్షత్రాల హొటెల్‌లో బసచేయడం జరిగిందని అన్నారు. వీరిద్దరూ కలిసి మూడు బెడ్ రూమ్ గదులు కలిగినటువంటి రూమ్‌ని వాళ్శ తల్లిదండ్రులతో షేర్ చేసుకోవడం జరిగిందని తెలియజేశారు.


Click it and Unblock the Notifications











