twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హింసాత్మక వరల్డ్‌లో బ్రకుతున్నామన్న సూపర్ స్టార్

    By Bojja Kumar
    |

    'మనం హింసాత్మక ప్రపంచంలో బ్రతుకుతున్నాం' అంటూ హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ ఫిట్ వ్యాఖ్యానించారు. తాను నటిస్తున్న తాజా గ్యాంగ్ స్టర్ చిత్రం 'కిల్లింగ్ దెమ్ సాఫ్ట్లీ' ప్రపంచంలో జరుగుతున్న హింసాత్మక ఘటలను ఆధారం చేసుకుని రూపొందించిందే అని ఆయన చెప్పుకొచ్చారు.

    2008 ఆర్థిక మాంద్యం తర్వాత ప్రపంచంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? హింస విపరీతంగా పెరిగి పోవడానికి కారణం ఏమిటి? అనే అంశాలు ఇందులో ఉంటాయన్నారు. బ్రాడ్ ఫిట్ ఈచిత్రంలో అసిస్టెంట్ హిట్ మ్యాన్ పాతను పోషిస్తున్నారు. ఆండ్రివ్ డొమినిక్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తునారు.

    ఈ చిత్రంలో ఇంకా రిచర్డ్ జాక్లిన్, జేమ్స్ గాండోల్ఫిని, రే లిట్టా, స్కాట్ మెక్ నారీ, సామ్ షెపార్డ్, స్లాన్, బెల్లా హీట్ కోట్, విన్సెంట్ కురాటోలా, లినారా వాషింగ్టన్, గార్రెట్ దిల్లాహంట్ తదితరులు నటిస్తున్నారు. గతంలో బ్రాడ్ ఫిట్ హీరోగా వచ్చిన చిత్రంకంటే ఇది విభిన్నంగా ఉంటుంది.

    ప్లాన్ బి స్టూడియోపై డేడ్ గార్డెనర్, బ్రాడ్ ఫిట్, పౌలా మీస్కావాట్జ్, స్టెవ్ స్కావాట్జ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి స్క్రీన్ ప్లే ఆండ్రివ్ డొమెనెక్, సినిమాటోగ్రఫీ : గ్రెగ్ ఫాషెర్, ఎడిటింగ్ : బ్రెయిన్ ఎ. కేట్స్, జాన్ పాల్. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మే 22న ఈచిత్రాన్ని ప్రదర్శించారు. అయితే యూఎస్ థియేటర్లలోకి మాత్రం సెప్టెంబర్ 21, 2012న రాబోతోంది.

    English summary
    Brad Pitt believes that we live in a "very violent world", which is reflected in his new gangster movie 'Killing Them Softly'. The 48-year-old actor, who is engaged to Angelina Jolie, believes his new gangster flick represents wider changes in the world since the economic crash of 2008, and believes how violence is romanticized in cinema is an important question.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X