twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విగ్ ధరించడం చాలా అసౌకర్యంగా అనిపించింది: రాబర్ట్ ప్యాటిన్సన్

    By Nageswara Rao
    |

    లండన్, జులై 17: సినిమాల్లో చాలా మంది స్టార్ హీరోలకు బట్ట తల ఉంటే విగ్గుని ధరింపజేస్తారు. విగ్గు అనేది కొంత మందికి సరిగ్గా సరిపోతుంది. మరికొంత మందికి సరిపోక చికాకుగా అనిపిస్తుంది. సరిగ్గా హాలీవుడ్‌లో ఒక హీరోకు విగ్గుని ధరింప జేస్తే చికాకు పుట్టుకొచ్చి ఆ అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఆ హీరో పేరు రాబర్ట్ ప్యాటిన్సన్. రాబర్ట్ ప్యాటిన్సన్ హీరోగా నటించిన 'ది ట్విలైట్ సాగా: బ్రేకింగ్ డాన్- పార్ట్ 2' సినిమాలో కొన్ని సన్నివేశాలను తిరిగి చిత్రీకరణకు తొలిసారి విగ్గుని ధరించాడు.

    26 సంవత్సరాల వయసు కలిగిన రాబర్ట్ ప్యాటిన్సన్ ఈ విగ్ విషయంపై మాట్లాడుతూ నా జీవితంలో కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయాల్సి వచ్చి విగ్‌ని ధరించాను. ట్విలైట్ సినిమా చివరి రెండు రోజులు నా తలపై ఆరంజ్ విగ్‌ని దర్శకుడు ఉంచారు. ఐతే ఈ విగ్ నా తలపై ఉన్నంత సేపు నేను నా పాత్రను ఎంజాయ్ చేయలేకపోయాను. విగ్ పెట్టుకోవడం నాకు చాలా చెత్తగా అనిపించిందంటూ విగ్‌ను 'ఫ్రాంకెన్స్టైయిన్ రాక్షసుడు'తో పోల్చాడు.

    విగ్‌ను తయారు చేసిన టెక్నిషన్ ఆరు విగ్‌లను కలిపి ఒకే విగ్‌గా రూపొందించాడని పేర్కోన్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో రాబర్ట్ ప్యాటిన్సన్ కో స్టార్స్ మానవాతీతమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ మానవాతీతమైన పాత్రల కోసం కోస్టార్స్ టేలర్ లాట్నర్, ఆష్లే గ్రీన్, నిక్కీ రీడ్‌లు విగ్‌లు ధరించారు. 'ది ట్విలైట్ సాగా: బ్రేకింగ్ డాన్- పార్ట్ 2' సినిమాను నవంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'ది ట్విలైట్ సాగా: బ్రేకింగ్ డాన్- పార్ట్ 1' కొనసాగింపుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    తెలుగు వన్ఇండియా

    English summary
    Actor Robert Pattinson wore a wig for the first time to re-shoot some scenes of “The Twilight Saga: Breaking Dawn - Part 2″ and didn’t enjoy the experience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X