మూడో సారి పెళ్లికి సిద్ధమవుతోన్న తార
పాప్ రారాణి బ్రట్నీ స్పియర్స్ మరో సారి పెళ్లికి సిద్ధం అవుతోందని విశ్వసనీయ సమాచారం. ఈ దఫా ఆమె తన ఏజెంట్ జాన్సన్ ట్రావిక్ ను వివాహమాడనుందని తెలిసింది. కొన్ని నెలలుగా జాన్సన్ తో డేటింగ్ చేస్తోన్న ఈ 27 ఏళ్ల గాయని ఈ విషయాన్ని ఎప్పుడూ ఈ విషయాన్ని బహిర్గతం కానీయలేదు. కాగా ఈ మధ్య తన తల్లిదండ్రులతో తను జాన్సన్ ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు తెలిపిందట. దీనికి ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యపోలేదట, కానీ స్నేహాన్ని ప్రేమ అనుకొని ఎక్కడ తప్పటడుగు వేస్తుందోనని భయపడుతున్నారట.
కానీ బ్రిట్నీ మాత్రం జాన్సన్ తో పీకల్లోతు ప్రేమలో పడిపోయిందట. అతను వుంటే చాలా సంతోషంగా వుంటానని తన సన్నిహితుల వద్ద చెబుతోందట. కాగా ఇంతకు ముందు రెండు సార్లు పెళ్లి చేసుకున్న బ్రట్నీకి అవి చేదు జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయి. ఈ వివాహం ఆమె జీవితంలో సంతోషాన్ని తీసుకురావాలని ఆశిద్దాం...
బ్రట్నీ స్పియర్స్ జాన్సన్ ట్రావిక్ పాప్ రారాణి హాలీవుడ్ పెళ్లి britney spears jason trawick pop singer hollywood jamie spears


Click it and Unblock the Notifications