ఈ వారంతానికి నా జీవితంలో ఆనందపు క్షణాలు
లాస్ ఏంజిల్స్, జూన్ 27: హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మైలీ సైరస్, క్రిస్ హెమ్స్‌వర్త్ ఇద్దరూ 2009 నుండి డేటింగ్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. మే 31వ తారీఖున క్రిస్ హెమ్స్ 3.5 క్యారెట్ రింగ్‌తో మైలీ సైరస్‌ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. దీంతో మైలీ సైరస్, క్రిస్‌ను ఎప్పటి నుండో ప్రేమిస్తుండడంతో పెళ్లికి తన అంగీకారం తెలిపింది.
మైలీ సైరస్ ఎప్పటికప్పడు తాజా సమాచారాన్ని తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. మైలీ సైరస్‌ను అభిమానులు మీ వెడ్డింగ్ డేట్ ఎప్పుడని ట్విట్టర్‌లో ప్రశ్నించగా.. దీనికి సమాధానంగా మైలీ సైరస్ "సోమరితనపు సూపర్ ఆదివారం, ఇక వచ్చే వారం కోసం వేచి ఉండలేను.. నా జీవితంలో ఆనందపు క్షణాలు రానున్నాయి" అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో మైలీ సైరస్ అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వారాంతంలోనే మైలీ సైరస్, క్రిస్ ఇద్దరూ ఒక ఇంటివారు కాబోతున్నారన్నమాట.
డిస్నీ సినిమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న బుల్లి స్టార్ హీరోయిన్ మైలీ సైరస్. హాలీవుడ్ యూత్ జంటైన మైలీ సైరస్, క్రిస్ హెమ్స్‌వర్త్ వీళ్శిద్దరూ కలసి 'లాస్ట్ సాంగ్' నటించారు. ఈ సినిమాలో వీళ్శు ఇద్దరూ మంచి హాట్ సన్నివేశాల్లో నటించారు. 'ది లాస్ట్ సాంగ్' సినిమాని నికోలస్ స్పార్క్ నవల ఆథారంగా తీశారు. ఇటీవల కాలంలో హాలీవుడ్లో అతి దరిద్రమైన సెలబ్రిటీ రోల్ మోడల్ ఎవరూ అని పోల్ నిర్వహించగా అందరూ కూడా మైలీ సైరస్‌కు అత్యధిక ఓట్లు వేసి గెలిపించారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











