మూడో పెళ్లిపై ఆశలు పెంచుకున్న గాయని
అస్ట్రేలియా గాయని డాన్నీ మైనోగ్ పెళ్లి కూతురు కానుంది. ఆమె బాయ్ ఫ్రెండ్ క్రిస్ స్మిత్ తో వివాహానికి రంగం సిద్ధం అయింది. ఇంతకు ముందు జూలియన్ మరియు జాక్వెస్ లను వివాహం చేసుకుని విడిపోయిన ఈ గాయని ఇకపై పెళ్లి చేసుకోనని ప్రకటించింది. కానీ ఆమె తాజా బాయ్ ఫ్రెండ్ మోడల్ క్రిస్ స్మిత్ తో పరిచయమయ్యాక ఆమె తన నిర్ణయాన్ని మార్చుకొంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెళ్లడించారు. ఇక పై తానిలాంటి ప్రకటన చేస్తానని అనుకోలేదని, కానీ క్రిస్ స్మిత్ ను కలిసాకా ఇతనితో జీవితాంతం కలసి వుండాలని అనిపించిందని, అందుకే తానీ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది.. కనీసం ఈ మూడో పెళ్లి అయినా ఆమెకు కలసి రావాలని ఆమె శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.
డాన్నీ మైనోగ్ అస్ట్రేలియా హాలీవుడ్ క్రిస్ స్మిత్ గాయని dannii minogue australia singer kris smith hollywood


Click it and Unblock the Notifications