వివాహం ఒత్తిడితో కూడు కున్న పని: క్రిస్టెన్
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రిస్టెన్ బెల్ ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ పెళ్లి అనేది ఒత్తిడితో కూడుకున్న విషయని అన్నారు. ఇక వివరాల్లోకి వెళితే, గత రెండు సంవత్సరాలుగా క్రిస్టెన్ బెల్, డాక్స్ షెపర్డ్‌తో కలసి జీవిస్తున్నప్పటికీ... మా ఇద్దరం పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఇంత వరకు రాలేదని అన్నారు. ఇందుకు గల కారణం ఏంటనీ అడగగా.. పెళ్లి చేసుకుంటే మనుషుల మద్య ఒత్తిడి పెరుగుతుందని అన్నారు.
31సంవత్సరాల వయసు కలిగిన క్రిస్టెన్ బెల్ మేము మమ్మల్ని ఇప్పటికే వివాహితులు పరిగణలోకి తీసుకున్నామన్నారు. వెడ్డింగ్ రింగ్స్ కూడా ధరించాం. మళ్లీ మా ఇద్దరి మద్యా పెళ్లి అనే ప్రస్తావన రాకూడదని అనుకుంటున్నాం. ఎందుకంటే వెడ్డింగ్ ఐతే మనుషులు ఆటోమాటిక్‌గా ఒత్తిడిలో పడతారని సెలవిచ్చింది. ఇంకా చెప్పాలంటే ఒక చిన్న మ్యారేజి ఇద్దరి మనుషుల మద్య బంధావ్యాన్నికలుపుతుందని నాకు తెలుసు.
ఎందుకంటే నేను సాంప్రదాయమైన కుటుంబం నుండి వచ్చాను. వివాహం సర్టిఫికేట్ ముఖ్యమైనదని నాకు తెలుసు. కానీ మనం ముసలి వారిమై పోయాక అది ఎంత చిన్నదిగా కనిపిస్తుందో కదా అని అన్నారు. మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో ఎవరితో ఒకరితో కలసి జీవించాల్సి ఉంటుందని అన్నారు. ఒకరితో కలసి మన జీవించడం, మనకు నచ్చిన అన్ని విషయాలను వారితో పంచుకోవడం చాలా అందంగా ఉంటుందని అన్నారు.


Click it and Unblock the Notifications











