నిజ జీవితంలో పెళ్లి కూడా అలా జరిగితే బాగుండు..
21సంవత్సరాల వయసు కలిగిన క్రిస్టినా స్టివార్ట్ సోమవారం లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 'ట్విలైట్ సాగా:బ్రేకింగ్ డాన్ పార్ట్ 1' బ్లాక్ కార్పెట్ ప్రీమియర్‌లో హీరో రాబర్ట్ ప్యాట్రిసన్‌తో హాజరవ్వడం జరిగింది. ఈ సందర్బంలో క్రిస్టినా స్టివార్ట్ ఈ సినిమా విశేషాలను తెలియజేస్తూ, గతంలో మేము నటించిన ట్విలైట్ సినిమాకు ఇది కొనసాగింపుగా వస్తున్న విషయం అభిమానులకు తెలిసిందే. గతంలో ఎలాగైతే మా జంట అభిమానులను ఎలాగైతే అలరించిందో, ఇప్పుడు కూడా అదే విధంగా అభిమానులను అలరిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
'ట్విలైట్ సాగా:బ్రేకింగ్ డాన్ పార్ట్ 1' సినిమాలో అభిమానులు అందరికి ఆశ్చర్య పోయేటటువంటి సన్నివేశాలున్నాయని అన్నారు. మా ఇద్దరికి జరిగినటువంటి పెళ్లి సినిమా సన్నివేశాలు సినిమా మొత్తానికి పెద్ద హైలెట్‌గా నిలుస్తాయని అన్నారు. నిజం చెప్పాలంటే నిజ జీవితంలో పెళ్లిళ్లు ఎలా జరుగుతాయో అదే విధంగా మా పెళ్లి జరిగిందని తెలియజేశారు.
పెళ్లి సన్నివేశాలు మాత్రం నా సినీ జీవితంలో గుర్తుంచుకునేవి మాత్రమే కాకుండా, నాకు ఓ చక్కని అనుభూతనిచ్చాయని అన్నారు. నేనైతే సినిమాలో మాదిరే నా నిజ జీవితంలో కూడా ఇలాగే పెళ్లి జరిగితే బాగుంటుందని అనిపించిందని అన్నారు. 'ట్విలైట్ సాగా:బ్రేకింగ్ డాన్ పార్ట్ 1' సినిమా త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమైంది. ఈ సినిమాలో హీరోగా రాబర్ట్ ప్యాట్రిసన్ నటిస్తే, హీరోయిన్ బెల్లా పాత్రలో క్రిస్టినా స్టివార్ట్ నటించారు.


Click it and Unblock the Notifications











