పిల్లల్ని ఎత్తుకోవడమేనా.. తాను ప్రెగ్నెంట్ అవ్వాలి..!
లండన్, జూన్ 12: హాలీవుడ్ ప్రముఖ సింగర్ కేన్ వెస్ట్ తన గర్ల్ ప్రెండ్ సామాజిక వేత్త కిమ్ కర్దాషియాన్‌తో కలిసి కుటుంబాన్ని ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఓ ఇంటర్యూలో కేన్ వెస్ట్ మాట్లాడుతూ కిమ్ కర్దాషియాన్ ఎప్పుడూ తన చెల్లెలు బాబుని ఎత్తుకోని ఉండడం నాకు ఇష్టం లేదు. తను కూడా ఏదో ఒకరోజు అందమైన ప్రెగ్నెంట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.
31 సంవత్సరాల వయసు కలిగిన కిమ్ కర్దాషియాన్ ఎంత గానో ప్రేమించి బాస్కెట్ బాల్ ప్లేయర్ క్రిస్ హాంప్రస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత 72 రోజులు గడవక ముందే తన భర్త నుండి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కిమ్ కర్దాషియాన్ కేన్ వెస్ట్‌తో డేటింగ్ చేస్తుంది. ఈ డేటింగ్ వ్యవహారం త్వరలో వీరిద్దరిని ఒక ఇంటి వారిని చేయనుందని పలువురు కిమ్ కర్దాషియాన్ సన్నిహితులు గుస గుస లాడుతున్నారు.
గత మూడు నెలలుగా సింగర్ కేన్ వెస్ట్‌తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కిమ్, కేన్ వెస్ట్ వారికి సంబంధిత గృహాలను మార్కెట్లో వేలానికి పెట్టి, ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో సహాజీవనం కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. కిమ్ కర్దాషియాన్, కేన్ వెస్ట్ ఇద్దరూ లాస్ ఏంజిల్స్‌లో ఉన్న తమ తమ ఇళ్లను వేలానికి మార్కెట్లో పెట్టి, ఇద్దరూ కలిసి ఓ అందమైన ఇంటి కోసం వెతుకులాట ప్రారంభించారు.
వీరిద్దరూ కలిసి పయనించడానికి, సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. వారు అనుకున్నట్లు పనులన్నీ వేగంగా జరిగితే త్వరలోనే కిమ్ మరియు కేన్ వెస్ట్ కలిసి ఒక కొత్త ఇల్లు అద్దెకు తీసుకుంటారని కిమ్ అధికార ప్రతినిధి తెలిపారు.


Click it and Unblock the Notifications











