twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2010 లో రాబోతున్నవి భారీ చిత్రాలే..!!

    By Kuladeep
    |

    ఈ ఏడాది హాలీవుడ్ కు బాగా కలసి వచ్చింది. భారీ బడ్జెట్ సినిమా తో పాటు రికార్డు స్థాయి వసూల్లతో ఈ ఏడాది అంతా సజావుగానే గడిచింది. ఈ ఏడు విడుదలయిన హ్యారీ పోటర్, మైఖేల్ జాక్సన్ డాక్యుమెంటరీ సినిమా 'దిస్ ఈజ్ ఇట్', ట్విలైట్ సీక్వెల్ 'న్యూ మూన్', డూంబ్స్ డే '2012' చివరగా 'అవతార్' లాంటి సినిమాలు భారీగా వసూళ్లను రాబట్టాయి. ఇందులో దిస్ ఈజ్ ఇట్ మినహా మిగిలినవన్నీ భారీ చిత్రాలే. గత వారం చివరి చిత్రంగా వచ్చిన 'షెర్లాక్ హాల్మస్' కూడా మంచి వసూళ్లను సాధిస్తూ ముందుకు వెళుతోంది.

    ఇక ఈ సంవత్సరం మరో రెండు రోజుల్లో గుడ్ బై చెప్పేసి వెళ్లిపోనుంది, 2010 వ సంవత్సరానికి హాయ్ అంటూ పలకరించబోతోంది. మరి రాబోవు సంవత్సరం హాలీవుడ్ సినిమాలకు ఏ విధంగా కలసిరానుందో కానీ, 2010 లో వచ్చే సినిమాలు కూడా దాదాపు అన్నీ భారీ చిత్రాలే కావడం గమనార్హం. 2010లో తొలి సినిమాగా రాబర్ట్ డోనీ నటించిన భారీ యాక్షన్ సినిమా ఐరన్ మ్యాన్ -2 విడుదల కానుంది. ఆ తర్వాత ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డు విజేత రసెల్ క్రోవ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టెయినర్ 'రాబిన్ హుడ్' సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు 'గ్లాడియేటర్', 'బ్లాక్ హాక్ డౌన్' వంటి అకాడమీ అవార్డులకు నామినేట్ అయిన చిత్రాలను రూపొందించి, విజువల్ ఎఫెక్టులను రూపొందించడంలో తనకు మరెవరూ సాటి రారని నిరూపించుకున్న దర్శకుడు రిడ్లే స్కాట్ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని వున్నాయి.

    బహుళప్రేక్షకాదరణ పొందిన 'ప్రిన్స్ ఆఫ్ పర్షియా' వీడియో గేమ్ వెండి తెర మీద 2010 లోనే ఆవిష్కరణ కానుంది. ఆ తర్వత ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకాదరణ పొందుతున్న పైరేట్స్ ఆఫ్ కరేబియన్ సీక్వెల్ కూడా 2010 లోనే ప్రయాణానికి సిద్ధం అవుతోంది. ఏంజలీనా జోలీ ప్రధాన పాత్ర పోషిస్తోన్న ది సాల్ట్, టూరిస్ట్ సినిమాలు కూడా 2010 లోనే ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నాయి. ఈ భారీ చిత్రాలు కాక ఈ ఏడాది మంచి ప్రేక్షకాదరణ పొందిన ట్విలైట్ సాగా న్యు మూన్, హ్యారీ పోటర్, యానిమేషన్ సినిమా ది ప్రిన్సెస్ అండ్ ది ప్రాగ్ సినిమాల సీక్వెల్ లు కూడా 2010 లోనే ప్రేక్షకుల తీర్పు కోరనున్నాయి.

    ఈ లెక్కన 2009 లాగే 2010 వ సంవత్సరం కూడా భారీ చిత్రాలతో కనువిందు చెయ్యనుంది. మరి వసూళ్లు ఎలా వుండబోతున్నాయో కాలమే సమాధానం చెప్పాలి..!!

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X