భర్త కోసం కన్నీటి పర్యంతం అయిన స్టార్ హీరోయిన్
బ్రాడ్ పిట్, ఏంజలీనా జోలీ ల సహజీవనం గురించి లాన్ హాల్పెరిన్ రాసిన పుస్తకం "బ్రాంజలీనా" లో రోజుకో కొత్త విషయం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటి వరకూ ఏంజలీనా, బ్రాడ్ లు మరో 18 నెలల్లో విడిపోనున్నారనే వార్తే అందరి నోళ్లలో నానుతుంగా, ఇదేమీ పట్టనట్టు ఈ వార్తలన్నీ ఒట్టి అపద్దాలే అనిపించేలా జోలీ, పిట్ లు చెట్టాపట్టాలేసుకుని పార్టీలకు అటెండ్ అవుతున్నారు. కాగా తాజాగా బ్రాడ్ పిట్ మాజీ భార్య జెన్నిఫర్ అనిస్టాన్ తన భర్త నుండీ విడాకులు తీసుకున్నాకా బాధతో ఎంజలీనా మీద గట్టిగా అరిచిందని, ఇద్దరి మధ్య మాటల యుద్ధం వేడెక్కాకా ఉద్వేగాన్ని ఆపుకోలేక అనిస్టాన్ కన్నీటి పర్యంతం అయిందని హాల్పెరిన్ "బ్రాంజలీనా" లో రాసాడు.
ఏంజలీనా తన భర్తను వలలో వేసుకుందని, అందువల్లే తమ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని అనిస్టాన్ బాధపడిందట. ఎంతో మందితో తిరిగిన ఆ తిరుగుబోతు...తన భర్తను కూడా తన వల్లో వేసుకుందని, ఒక వేళ తన భర్త ఆమె వల్లో పడుడక పోతే అప్పటికే పెళ్లయిన బిల్ క్లింటన్ తోనో లేదా జానీ డెప్ తోనో కలసి వుండేదని వ్యాఖ్యానించిందట. ఇది చదివిన వారంతా ముక్త కంఠంతో పాపం అనిస్టాన్...అంటున్నారు....!!


Click it and Unblock the Notifications











