ఎంజలీనాను తిట్టిపోసిన బ్రాడ్ పిట్ మాజీ భార్య అనిస్టాన్
హాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత బ్రాడ్ పిట్ ప్రస్తుతం ప్రపంచంలోనే సెక్సీ లుక్స్ గల ఎంజలీనా జోలీతో కలసి వుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల బ్రాడ్ పిట్ మాజీ భార్య జెన్నిఫర్ అనిస్టాన్, ఎంజలీనా మధ్య గొడవ జరిగిందని సమాచారం. ఎప్పుడూ శాంతంగా వుండి, సామాజిక సేవలో పాల్గొంటూ అందరి చేత శభాష్ అనిపించుకొంటున్న జోలీ కూడా అనిస్టాన్ మాటలకు తీవ్రంగా స్పందించిందట.
ఇంతకీ విషయమేమిటంటే మొన్నీమధ్య బాగా మద్యం సేవించిన అనిస్టాన్ తన మాజీ భర్త బ్రాడ్ తో మాట్లాడాలని ఫోన్ చేసిందట. బ్రాడ్ మాట్లాడతాడని అనుకున్న అనిస్టాన్, ఎంజలీనా ఫోన్ తీయడంతో దిగ్భ్రాంతి చెందిందట, అంతటితో ఆగక ఆవేశంతో జోలీపైన తిట్లదండకాన్ని అందుకొందట. తొలుత జోలీ వారించడానికి ప్రయత్నించినా అనిస్టాన్ ఇంకా రెచ్చిపోవడంతో ఇక చేసేది లేక అంతే ఘాటుగా స్పందించిందట.
ఎంజలీనా జోలీ బ్రాడ్ పిట్ జెన్నిఫర్ అనిస్టాన్ హాలీవుడ్ న్యూయార్క్ angelina jolie brad pitt jennifer aniston hollywood new york


Click it and Unblock the Notifications