twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమె ఫోన్ ఎందుకు అడుగుతున్నట్లు..: పాప్ సింగర్

    By Nageswara Rao
    |

    లండన్: హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిన్ బైబర్ స్నేహితులు సింగర్ రిహానా ఫోన్ నెంబర్ కావాలని అడగగా తాను చాలా ఆశ్చర్యానికి లోనయ్యాననితెలిపాడు. 18 సంవత్సరాల వయసు కలిగిన జస్టిన్ బైబర్ ఓ ప్రముఖ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ రిహానా చాలా మంచిది. మేమిద్దరం ఎప్పుడూ పరస్పరం టచ్‌లో ఉంటామని అన్నాడు. ఐతే మా స్నేహితులలో కొందరు సింగర్ రిహానా ఫోన్ నెంబర్ కావాలని పదే పదే నన్ను ఎందుకు అడుగుతున్నారో అర్దం కావడం లేదన్నాడు.

    నా స్నేహితులకు మాత్రం నేను ఫోన్ నెంబర్ చెప్పలేను. నా స్నేహితుడు మంచివాడే. ఐతే సింగర్ రిహానా నిజంగా డేటింగ్‌కి యువకుడుని కోరుకుంటే నిజంగా అతను గోప్ప వ్యక్తేనని అన్నాడు. ఇది ఇలా ఉంటే టీనేజ్ పాప్ సింగర్ జస్టిన్ బైబర్‌కు తన స్నేహితులురాలు సెలెనా గోమెజ్‌తో నిశ్చితార్థం అయిందంటూ వస్తున్న వార్తలను బైబర్ అధికార ప్రతినిధి కొట్టి పారేశారు. అసలు ఈ వార్త రావడానికి కారణం చికాగో సన్ టైమ్స్ రిపోర్టర్. జస్టిన్ బైబర్, సెలీనా గోమెజ్ ఇద్దరూ ఎంగేజ్‌మెంట్ కోసం షాపింగ్ చేస్తున్నారంటూ చికాగో సన్ టైమ్స్ రిపోర్టర్ కథనాన్ని ప్రచురించాడు.

    దీనితో పాటు ఓ ప్రముఖ వెబ్ సైట్ వీరిద్దరూ పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యారంటూ ఓ ఆర్టికల్‌ని ప్రచురించింది. ఈ ఆర్టికల్‌లో సూపర్ స్టార్ జంట దగ్గరగా ఉన్న అనేక మంది వ్యక్తులు వారి నిశ్చితార్థం సమీప భవిష్యత్తులో ఉందని అంటున్నారు. అమెరికాలో ఉన్న అతి పెద్ద జ్యూయలరీ షాపులన్నింటిని కలియ తిరగడమే కాకుండా.. పెళ్లికి ఎటువంటి జ్యూయలరీ ఐతే సరిపోతుందో వీరిద్దరే దగ్గరుండి మరీ నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కోంది.

    ఈ విషయాలన్నింటిపై బైబర్ అధికార ప్రతినిధి స్కూటర్ బ్రౌన్ మాట్లాడుతూ ఇంటర్నెట్లో వస్తున్న ఈ పుకార్లు పూర్తిగా అబద్దం అని అన్నారు. ఇది ఇలా ఉంటే జస్టిన్ బైబర్, సెలీనా గోమెజ్ ఇద్దరూ 2010 నుండి డేటింగ్‌లో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే.

    English summary
    Singer Justin Bieber was surprised when one of his friends asked him for Rihanna’s phone number.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X