మరో 'అవతార్' లాంటి సినిమా..!!
జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన 'అవతార్' ఘనవిజయంతో ఈ తరహా ఫాంటసీ సినిమాల మీద ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి సదురు నిర్మాతలు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. తాజా 2009వ సంవత్సరం లో వచ్చిన 'వేర్ ది వైల్డ్ థింగ్స్ ఆర్' అనే హాలీవుడ్ సినిమాను ఇండియాలో విడుదల చెయ్యడానికి ఈ సినిమాను రూపొందించిన వార్నర్ బ్రదర్స్ ప్రయత్నాలు ముమ్మరం చేసారు.
1963వ సంవత్సరంలో వచ్చిన వేర్ ది వైల్డ్ థింగ్స్ ఆర్ అనే పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని వార్నర్ బ్రదర్స్ నిర్మించిన ఈ చిత్రం 100,000,000 డాలర్ల భారీ బడ్జెట్ తో రూపొంది 2009 అక్టోబరు 16 న అమెరికాలో, డిసెంబరు 11న యుకె లో విడుదలయి ఘనవిజయాన్ని సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. మ్యాక్స్ రికార్డ్స్, క్యాథరిన్ కీనర్ మరియు మార్క్ రుఫాలో ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు ప్రముఖ నటుడు టామ్ హ్యాంక్స్ కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం. త్వరలోనే ఈ సినిమా ఇండియాలో విడుదలకానుంది.


Click it and Unblock the Notifications











