న్యూ ఇయర్ పార్టీలో ఏ సెలబ్రిటీ ముద్దు బెటర్..?
సాధారణంగా డిసెంబర్ వచ్చిందంటే క్రిస్‌మస్, ఆ తర్వాత నూతన సంవత్సర సంబరాలు అంగరంగ వైభవంగా చేసుకోవాలని చాలా మంది తాపత్రయపడుతూ ఉంటారు. యాహు ఇటీవల 1,000 మంది రీడర్స్‌తో ఓ సరిక్రొత్త పోల్‌ని నిర్వహించింది. ఈ పోల్ స్పెషాలిటీ ఏంటంటే నూతన సంవత్సర పార్టీలో ఓ సెలబ్రిటీని ముద్దు పెట్టుకొవాలని యూజర్స్ కోరుకుంటారోనని ఓ పోల్‌ని నిర్వహించారు.
ఈ పోల్‌లో ఎక్కువ మంది పాఠకుల బ్రాడ్ పిట్ మాజీ భార్య జెన్నిఫర్ ఆనిస్టన్‌కి 28శాతం ఓటింగ్‌తో మొదటి స్దానాన్ని కట్టబెట్టారు. ఈ పోల్‌లో ఆడవారితో పాటు, మగవారి పేర్లను కూడా పెట్టగా, మగవారిలో మొదటి స్దానాన్ని జార్జి క్లూనీ 22శాంత ఓటింగ్‌తో కైవసం చేసుకున్నారు. పెదాల సుందరి ఏంజిలీనా జోలి 13శాతం ఓటింగ్‌తో మూడవ స్దానాన్ని కైవసం చేసుకోగా, నాల్గవ స్దానాన్ని మేఘన్ ఫాక్స్ 12శాతం ఓటింగ్‌తో సోంతం చేసుకుంది. ఆడవారు ఎక్కువగా ఇష్టపడిన వారిలో జానీ డెప్, గోస్లింగ్, రేయన్ రేనాల్డ్స్, బ్రాడ్ పిట్‌లు ఉన్నారు.


Click it and Unblock the Notifications











