48లో పాప్ స్టార్ వైట్నీ హాస్టన్ కన్నుమూత
లాస్ ఏంజిల్స్: 48 సంవత్సరాల వయసు కలిగిన అమెరికాకు చెందిన పాప్ గాయని, నటి వైట్నీ హాస్టన్ లాస్ ఏంజిల్స్‌లో మృతి చెందారు. ఆమె మృతి చెందినట్లు ఆమె కుటుంబ ప్రతినిధి క్రిస్టెన్ ఫోస్టర్ హాస్టన్ ధృవీకరించారు. ఐతే ఆమె మృతికి గల కారణాలను మాత్రం వెల్లడించారు. వైట్నీ హాస్టన్ న్యూజెర్సీలో పెరగడం వల్ల మొదట ఓ చర్చిలో పాడగా.. ఆ తర్వాత నైట్ క్లబ్స్‌లోనూ సింగర్‌గా పని చేశారు.
ఆ తర్వాత మోడల్.. వైట్నీ హాస్టన్ సింగర్‌గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఈమె విడుదల చేసిన చాలా ఆల్బమ్స్ ప్రజాదరణ పొందడమే కాకుండా.. రికార్డు స్దాయి లాభాలను తెచ్చిపెట్టాయి. 1980 - 90 మద్యలో ఎన్నో అవార్డులను గెలుపొందారు. హాలీవుడ్లో బాక్సాఫీసు రికార్డుల్ని సృష్టించిన ది బాడీగార్డ్, వెయిటింగ్ టు ఎక్సేల్ సినిమాల్లో నటించింది.


Click it and Unblock the Notifications











