'ది టెర్మినల్' సినిమాకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి మృతి..విమానాశ్రయంలోనే 18 ఏళ్ళ జీవితం

పారిస్‌లోని చార్లెస్ డి గల్లె విమానాశ్రయంలో 18 ఏళ్ళు నివసించిన ఇరాన్ కు చెందిన మెహ్రాన్ కరీమి తుది శ్వాస విడిచారు. స్టీవెన్ స్పీల్‌బర్గ్ చిత్రం 'ది టెర్మినల్' సినిమాకు అతను స్ఫూర్తి అని అందరికి తెలిసిన విషయమే. ఇక శనివారం విమానాశ్రయంలోని టెర్మినల్ 2Fలో మెహ్రాన్ కరీమి నస్సేరీ గుండెపోటుతో మరణించినట్లు అధికారులు తెలిపారు. దౌత్యపరమైన గొడవల వలన బాహ్య ప్రపంచంలో బ్రతకడం అతనికి కుదరలేదు.

కొన్ని సమస్యలు ఎదుర్కొన్న తర్వాత విమానాశ్రయంలో అతను నివాసం ఎంచుకున్నాడు. జీవిత కాలం ఎల్లప్పుడూ తన సామాను తన పక్కనే ఉంచుకున్నాడు. కొన్నేళ్ళ క్రితం ఫైనల్ గా నస్సీరికి ఫ్రాన్స్‌లో నివసించే హక్కు ఇచ్చారు. కానీ మళ్ళీ ఇటీవల కొంత ఇబ్బందులు ఎదురవడంతో తో ఎయిర్ పోర్ట్ లోనే ఉండాల్సి వచ్చింది. మెహ్రాన్ కరీమి నస్సేరి (76) శనివారం మధ్యాహ్నం విమానాశ్రయంలోని టెర్మినల్ 2ఎఫ్‌లో గుండెపోటుతో మరణించినట్లు విమానాశ్రయ అధికారులు అధికారి తెలిపారు. ఇతని జీవిత ఆధారంగా 2004లో టామ్ హ్యాంక్స్ హీరోగా హాలీవుడ్ దర్శకుడు స్టీఫెన్ స్పీల్‌బర్గ్ 'ది టెర్మినల్' అనే సినిమా తీశారు.

Who Inspired Steven Spielbergs The Terminal movie Dies At Paris Airport

ఇక మెహ్రాన్ కరీమి నస్సేరి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్నాడు అని పోలీసులు గమనించారు. ఇక వైద్యబృందం అతడికి చికిత్స అందించినా కాపాడలేకపోయారు. నాస్సేరీ విమానాశ్రయం టెర్మినల్ 1లో 1988 నుండి 2006 వరకు జీవితాన్ని కొనసాగించారు. అతను వార్తాపత్రికలు మ్యాగజైన్‌ లతో పరుపుల మాదిరిగా ఏర్పరచుకొని ప్లాస్టిక్ బెంచ్‌ పై పడుకునేవాడు. అక్కడి సిబ్బంది కూడా అతనికి సహాయం చేసేవారు.

నాస్సేరీ 1945లో బ్రిటీష్ అధికార పరిధిలోని ఇరానియన్ తండ్రికి బ్రిటీష్ తల్లికి జన్మించాడు. ఇక 1974లో ఇంగ్లాండ్‌లో చదువుకోవడానికి ఇరాన్‌ నుంచి వెళ్ళేందుకు ప్రయత్నం చేశాడు. మధ్యలో పాస్ పోర్ట్ లేకపోవడం వలన దౌత్యపరమైన కేసులలో అతను జైలు పాలయ్యాడు. ఇక కొన్నాళ్ళకు ఏ దేశానికి వెళ్ళలేక పారిస్ లోని విమానాశ్రయంలోనే ఏళ్ళ తరబడి నివసించాల్సి వచ్చింది.
యూకే అలాగే ఐరోపాలోని అనేక దేశాలలో ఆశ్రయం కోసం అతను ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X