ఇండియన్ మోడల్‌తో లియోనార్డో డికాప్రియో డేటింగ్.. టైటానిక్ హీరోతో రొమాన్స్ చేస్తున్న నీలమ్ గిల్ ఎవరంటే?

హలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో అఫైర్లు, డేటింగ్ వ్యవహారం గురించిన వార్తలు మీడియాలో కొత్తేమీ కాదు. ఆయన డేటింగ్ వ్యవహారం మీడియాలో చర్చనీయాంశమవ్వడం వైరల్‌గా మారింది. ఇప్పటికే ముగ్గురితో జీవితాన్ని పంచుకొన్న ఆయన 50 ఏళ్ల వయసులో మరోసారి ఇండియన్ అమ్మాయితో అఫైర్ కొనసాగించడం మీడియాలో హైలెట్ అయ్యింది. లియోనార్డో డికాప్రియో అఫైర్, ఇండియన్ అమ్మాయి ఎవరనే విషయంలోకి వెళితే..

లియోనార్డో డికాప్రియో 1991 లో క్రిట్టర్స్ 3 అనే చిత్రం ద్వారా హాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత రొమియో జూలియట్, టైటానిక్, సెలెబ్రిటీ, ది బీచ్, డాన్స్ ప్లమ్, ది ఏవియేటర్, ది డిపార్టెడ్, ఇన్స్‌ప్షన్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్, ఎస్ ఆన్ ఫైర్, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ అనే చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు అందుకొన్నారు.

Who is Neelam Gill? Hollywood star Leonardo DiCaprio dating with Indo Britain model

లియోనార్డో డికాప్రియో వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 2000 సంవత్సరం నుంచి 2005 వరకు జిసెలె బండ్‌చెన్‌తో దాంపత్య జీవితాన్ని పంచుకొన్నారు. ఆ తర్వాత బార్ రాఫెలీతో 2005 నుంచి 2011 వరకు రిలేషన్‌షిప్‌ను కొనసాగించారు. కెమిలా మారోన్‌తో 2017 నుంచి 2022 వరకు బంధాన్ని కొనసాగించారు.

తాజాగా ఇండియన్, బ్రిటీష్‌కు చెందిన మోడల్ నీలమ్ గిల్‌తో చెట్టాపట్టాలు వేసుకొని కనిపించంతో అఫైర్ వార్తలు గుప్పమన్నాయి. ఈ మధ్యకాలంలో వారిద్దరు డిన్నర్ డేట్స్, అవుటింగ్ చేస్తూ మీడియా కెమెరాలకు చిక్కారు. దాంతో వారిద్దరు డేటింగ్ చేస్తున్నారనే వార్తలకు బలం చేకూరింది. అయితే వారిద్దరు కూడా తమ అఫైర్ గురించి అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Who is Neelam Gill? Hollywood star Leonardo DiCaprio dating with Indo Britain model

అయితే లియోనార్డో డికాప్రియో, నీలమ్ గిల్ ఇద్దరు కలిసి ఇటీవల కాన్స్ ఫిలింఫెస్టివల్‌కు కలిసి రెడ్ కార్పెట్‌పై నడిచి వచ్చి ఇంటర్నేషనల్ మీడియా కెమెరాలకు చిక్కారు. లియోనార్డో నటించిన ఫ్లవర్ ఆఫ్ ది మన్ సినిమాను కాన్స్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా కాన్స్‌లో వారిద్దరూ అన్యోన్యయంగా ఉంటూ సన్నిహితంగా కనిపించారు. దాంతో మరోసారి వారిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే విషయం మరోసారి స్పష్టమైంది అని మీడియాలో కథనాలు వచ్చాయి.

నీలమ్ గిల్ విషయానికి వస్తే.. ఇంగ్లాండ్‌లో జన్మించారు. నీలమ్ తల్లిదండ్రులు, వారి కుటుంబం ఇండియాలోని సిక్కు మతానికి చెందిన వారు. పంజాబ్ నుంచి యూకే వచ్చి స్థిరపడ్డారు. 14 ఏళ్ల వయసులోనే నెక్ట్స్ మోడల్ మేనేజ్‌మెంట్‌ గ్రూప్‌తో కలిసి పనిచేశారు. ప్రస్తుతం యూకేలో టాప్ మోడల్‌గా గుర్తింపు పొందారు. తాజాగా లియోనార్డో డికాప్రియోతో డేటింగ్ చేయడంతో మరింత పాపులారిటిని సంపాదించుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X