For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాధ్వీతో హాలీవుడ్‌ స్టార్‌ డేటింగ్‌? హాట్‌ టాపిగ్గా రూమర్స్‌.. ఇంతకు ఎవరామె?

|

2016లో భార్య ఏంజెలినా జోలి నుంచి విడాకులు తీసుకున్న హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ మరోసారి ప్రేమాయణంలో మునిగితేలుతున్నారన్న వార్త హాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయింది. ప్రముఖ అమెరికన్ సిఖ్ ఆధ్యాత్మిక గురు, సాధ్వీ సత్ హరి ఖల్సాతో ఆయన ప్రేమాయణం సాగిస్తున్నట్టు హాలీవుడ్‌లో వినిపిస్తోంది. గత ఏడాది ఓ చారిటీ కార్యక్రమంలో వీరు తొలిసారి కలిశారట. పరస్పరం అభిప్రాయాలు కుదరడంతో గత ఏడాది కాలంగా వీరు డేటింగ్ చేస్తున్నారని హాలీవుడ్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

 ఎవరీ ఖల్సా? ఏమిటామె నేపథ్యం..

ఎవరీ ఖల్సా? ఏమిటామె నేపథ్యం..

హఠాత్తుగా తెరపైకి వచ్చిన సత్‌ హరి ఖల్సా ఎవరు? ఆమె నేపథ్యమేమిటి? ఆమె భారతీయురాలేనా? ఆమెతో బ్రాడ్‌ పిట్‌ అనుబంధం ఏర్పడటానికి దారితీసిన కారణాలేమిటంటే.. పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఆ వివరాలు చూద్దాం..

హాలీవుడ్‌ స్టార్స్‌ ఆమె క్లెయింట్స్‌

హాలీవుడ్‌ స్టార్స్‌ ఆమె క్లెయింట్స్‌

సత్‌ హరి ఖల్సా ఒక ఆధ్యాత్మిక గురువు. నగల డిజైనర్ కూడా. భారతీయ మతాలైన హిందూయిజం, సిక్కియిజం స్ఫూర్తితో ఆమె రూపొందించే నగలకు హాలీవుడ్‌లో మాంఛి డిమాండ్‌ ఉంది. అంతేకాకుండా హరి ఖల్సా హోలిస్టిక్ హీలర్.. అంటే మత ప్రవచనాలతో వ్యాధుల బారిన పడిన వారికి ఆమె స్వాంతన కలిగిస్తూ ఉంటారు. ఎమ్మా వాట్సన్‌, జూలియా రాబర్ట్స్‌, స్టీవెన్‌ టేలర్‌, బ్రాడ్‌ పిట్‌ మాజీ భార్య జెన్నిఫర్‌ అనిస్టర్‌ తదితర హాలీవుడ్‌ టాప్‌ సెలబ్రిటీలు ఆమె క్లయింట్సే.

తలపాగ చుట్టుకున్న స్వీట్‌ యంగ్‌ లేడీ

తలపాగ చుట్టుకున్న స్వీట్‌ యంగ్‌ లేడీ

లాస్‌ ఏంజిల్స్‌ మ్యాగజీన్‌ ప్రకారం 2000 సంవత్సరంలో కొంత సమయం సత్‌ హరి ఖల్సా రెడ్‌ హాట్‌ చిల్లీ పెప్పర్‌ అనే మ్యూజిక్‌ బ్యాండ్‌తో గడిపారు. ఆ బ్యాండ్‌కు నర్సుగానూ సేవలందించారు. ఆ సమయంలో బ్యాండ్‌ చీఫ్‌ ఆంతోనీ కీదిస్‌కు గోమారులతో ఓజోన్‌ చికిత్స అందించేవారు. ఖల్సా తలపాగ చుట్టుకున్న స్వీట్‌ యంగ్‌ లేడీ అని, మహిళా గోమారులా ఆమె సాంగత్యం ఉంటుందని కీదిస్‌ తన ఆత్మకథలో రాసుకున్నారు.

సత్‌ హరి ఖల్సా భారతీయురాలా?

సత్‌ హరి ఖల్సా భారతీయురాలా?

ఆమె భారతీయురాలు కాదు. చదువుకునేందుకు ఆమె భారత్‌కు వచ్చారు. అమెరికాలో పుట్టిన ఆమె భారత్‌లోని ఓ బోర్డింగ్‌ స్కూల్లో చదివారు. ఇక్కడ చదువుకునే సమయంలోనే నగల తయారీ, హోలిస్టిక్‌ హీలింగ్‌ అంశాల పట్ల ఆసక్తి పెంచుకొని.. అదే వృత్తిగా మలుచుకున్నారు. తన కూతురు అమృత్‌ పేరుతో ఆమె నగల డిజైనింగ్‌ సంస్థను నడుపుతున్నారు. సిక్కు మతం పట్ల అమితంగా ఆకర్షితురాలైన ఆమె అమృత్‌సర్‌లోని గోల్డెన్‌ టెంపుల్‌ను ఓసారి సందర్శించారు

 బ్రాడ్‌ పిట్‌-హరి ఖల్సా ఎలా కలిశారు?

బ్రాడ్‌ పిట్‌-హరి ఖల్సా ఎలా కలిశారు?

రెడ్‌ హాట్‌ చిల్లీ పెప్పెర్స్‌ పర్సలన్‌ హీలర్‌గా సత్‌ హరి ఖల్సా గత ఏడాది పర్యటించారు. ఈ సమయంలో చారిటీ కార్యక్రమంలో భాగంగా సిల్వర్‌లేక్‌ కన్జర్వేటరీ మ్యూజిక్‌ గాలాను నిర్వహించారు. ఈ గాలాకు హాజరైన బ్రాడ్‌ పిట్‌ తొలిసారి హరి ఖల్సాను కలిశారు. హాలీవుడ్‌ అందచందాలకు అతీతంగా దృఢమైన, అందమైన మనస్సును ఆమె కలిాగి ఉండటం పిట్‌ను ఆకర్షించిందని, అదే వీరిమధ్య అనుబంధానికి దారితీసిందని యూఎస్‌ వీక్లి సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది.

ఖల్సాను ఎంతో స్పెషల్‌ గా ట్రీట్‌ చేస్తున్న పిట్‌

ఖల్సాను ఎంతో స్పెషల్‌ గా ట్రీట్‌ చేస్తున్న పిట్‌

తొలిసారి కలిసిన సమయంలో వీరు లోతైన సంభాషణ సాగించారని, అదే వీరి మధ్య అనుబంధాన్ని చిగిరించిందని, ప్రస్తుతం ఇద్దరూ గాఢమైన అనుబంధంలో మునిగితేలుతున్నారి యూఎస్‌ వీక్లి పేర్కొంది. హరి ఖల్సాను బ్రాడ్‌ పిట్‌ ఎంతో స్పెషల్‌ గా భావిస్తున్నాడని, ఆమె లేకుండా గడపలేకపోతున్నాడని, తాజాగా పిట్‌ యాడ్‌ ఫిల్మ్‌ సెలబ్రేషన్స్‌కు ఆమె రావడమే ఉదాహరణ అని అభిప్రాయపడింది. ఈ-ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ మాత్రం.. హరి ఖల్సా పిట్‌కు ఆధ్యాత్మిక మార్గదర్శనం మాత్రమే అందిస్తున్నారని, అంతకుమించి ఏమీ లేకపోవచ్చునని, వారు స్నేహితులేనని పేర్కొంది.

English summary
Hollywood Star Brad Pitt is now rumoured to be dating an American-Sikh spiritual guru Sat Hari Khalsa. the two met at a charity gala last year and have been dating for a year now, Says Reports. who is Sat Hari Khalsa?
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more