twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Next James Bond 007 ఎవరో తెలుసా? భారీగా పోటీపడుతున్న హాలీవుడ్ హీరోలు వీరే

    |

    హాలీవుడ్ చిత్రాల్లో జెమ్స్ బాండ్ క్యారెక్టర్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారనే విషయం చెప్పడం కొత్తేమీ కాదు. సినీ పండితుల నుంచి సగటు ప్రేక్షకుడి వరకు భాష, ప్రాంతమనే భేదం లేకుండా జెమ్స్ బాండ్ పాత్రను అమితంగా ఆరాధిస్తుంటారు. సీన్ కానరీ, జార్జ్ లేజెన్‌బీ, రోజర్ మూర్, తిమోతీ డాల్టన్, పియర్స్ బ్రోస్నన్, డేనియల్ క్రేగ్ వరకు ఆ పాత్రను పోషించడమే కాకుండా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకొన్నారు. అయితే డేనియల్ క్రేగ్ గుడ్ బై చెప్పిన తర్వాత ఈ పాత్ర కోసం పోటీ పడుతున్న నటుల వివరాల్లోకి వెళితే..

    తొలి నల్లజాతి యాక్టర్ పేరు

    తొలి నల్లజాతి యాక్టర్ పేరు

    తదుపరి జెమ్స్ బాండ్ కోసం పరిశీలనలో ఉన్న పేరు ఇద్రిస్ ఎల్బా. ఒకవేళ బాండ్ పాత్ర పోషిస్తే తొలి నల్లజాతి యాక్టర్‌గా ఓ ఘనతను సాధిస్తాడు. బీస్ట్స్ ఆఫ్ నో నేషన్, పసిఫిక్ రిమ్ చిత్రాల్లో తన అద్బుతమైన నటనా ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొన్నారు. ఐదుసార్లు ఎమ్మి నామినేషన్స్ సాధించడంతో పలు చిత్రాల్లో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్నారు. అయితే ఈయన వయస్సు 50 ఏళ్లు దాటడంతో బాండ్ పాత్రలో ఒదిగిపోతారా అనే విషయం చర్చనీయాంశమైంది.

    మ్యాన్ ఆఫ్ స్టీల్ హెన్నీ కావిల్

    మ్యాన్ ఆఫ్ స్టీల్ హెన్నీ కావిల్

    ఇక మ్యాన్ ఆఫ్ స్టీల్ చిత్రంతో ఆకట్టుకొన్న 39 ఏళ్ల హెన్రీ కావిల్ కూడా జెమ్స్ బాండ్ పాత్రకు జరుగుతున్న రేసులో ముందున్నాడు. అయితే డేనియల్ క్రేగ్‌ నటించిన కాసినో రాయల్ చిత్రంలో బాండ్ పాత్రకు ముందు ఈయనే అనుకొన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల హెన్నీ మిస్ చేసుకొన్నారు. అయితే ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి అవకాశం వస్తే తప్పకుండా నేను జేమ్స్ బాండ్‌ ఛాన్స్ వదులుకొను అని అన్నాడు.

    రేజే జీన్ పేజ్ పేరు పరిశీలనలో

    రేజే జీన్ పేజ్ పేరు పరిశీలనలో

    పీరియాడిక్ చిత్రాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకొన్న హాలీవుడ్ నటుడు రేజే జీన్ పేజ్ జేమ్స్ బాండ్ కోసం జరిగే రేసులో ముందున్నారు. బ్రిడ్జ్‌టన్ చిత్రంలో డ్యూక్ ఆఫ్ హేస్టింగ్స్ పాత్రలో నటించి ఉత్తమ బ్రిటీష్ యాక్టర్‌గా గుర్తింపు పొందారు. మూడో బాండ్ రోజ్ మూర్ అడుగు జాడల్లో నడిచి ది సెయింట్ చిత్రంలో నటించారు.

    007 రేసులో ఐడాన్ టర్నర్

    007 రేసులో ఐడాన్ టర్నర్

    బీబీసీ రూపొందించిన పోల్డార్క్ పిరియాడిక్ డ్రామాలో అద్బుతంగా నటించిన ఐరీష్ యాక్టర్ ఐడాన్ టర్నర్ ప్రస్తుతం జేమ్స్ బాండ్ రోల్ కోసం అందరికంటే ముందు రేసులో ఉన్నారు. హాబిట్ ట్రైలాజీలో కిలి పాత్రతో మంచి గుర్తింపు కూడా తెచ్చుకొన్నారు. ఐడాన్ టర్నర్‌పై అందరి దృష్టి పడుతున్నది.

    గేమ్ ఆఫ్ థ్రోన్ యాక్టర్ పేరు

    గేమ్ ఆఫ్ థ్రోన్ యాక్టర్ పేరు

    బీబీసీ రూపొందించిన బాడీగార్డ్ చిత్రంలో పోలీస్ అధికారి డేవిడ్ బడ్‌గా నటించిన రిచర్డ్ మ్యాడెన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నది. స్కాట్లాండ్‌కు చెందిన ఈ నటుడు గేమ్ ఆఫ్ థ్రోన్ మూవీలో రాబ్ స్టార్క్‌గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకొన్నారు. రిచర్డ్ మ్యాడ్ జేమ్స్ బాండ్‌గా అందరి ప్రశంసలు అందుకొనే సత్తా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

    English summary
    Hollywood actor Deniel Craig says good bye to James bond 007 role. Now, Few of the star are considering for the James bond role. Here are the details.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X