కమెడియన్స్ అందంగా ఉండరని చెప్పింది ఎవరు..?
సాధారణంగా సినిమాల్లో హీరోలు మాత్రమే వారి యొక్క జిమ్ బాడీలు, సిక్స్ ప్యాక్ శరీరాలను వెండి తెరపై చూపిస్తుంటారు. హీరోలు ప్రక్కన ఉండే కమెడియన్లు మాత్రం ఎప్పుడూ హీరోలకు అనుగుణంగా నడుచుకుంటూ, అభిమానులను నవ్విస్తూ ఉంటారు. ఇదే తంతు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో నైనా సర్వసాధారణం. అమెరికా ఫన్నీ మ్యాన్, కమెడియన్ డేన్ కుక్ హావాయ్ బీచ్‌కు తన గర్ల్ ప్రెండ్‌తో ఎంజాయ్ చేయడానికి వెళ్లి అక్కడ తన సిక్స్ ప్యాక్, టోన్డ్ బాడీని చూపించారు.
39 సంవత్సరాలు వయసు కలిగిన డేన్ కుక్ తన గర్ల్ ప్రెండ్ కోసం జిమ్‌కి వెళ్లి మరీ అత్యంత అధ్బుతంగా తన ఫిజిక్‌ని పెంపోందించడం జరిగింది. కమెడియన్‌గా హాలీవుడ్లో కెరియర్‌ని మొదలుపెట్టి హీరో స్దానానికి ఎదిగి తనకంటూ అభిమానులను సంపాదించుకున్నారు. తన గర్ల్ ప్రెండ్‌తో కలసి హావాయి బీచ్‌లో ఒంటి మీద ఎటువంటి డ్రస్సు లేకుండా ఎంజాయ్ చేస్తూ కెమెరాకి దోరికిపోయారు. ఈ ఫోటోలను గనుక ఆడవారు ఎవరైనా చూస్తే తప్పకుండా డేన్ కుక్‌కి ఫ్యాన్స్ అవుతారని అభిప్రాయం.
డేన్ కుక్ ట్విట్టర్‌ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వారికి తను లాస్ ఏంజిల్స్ ఏజిమ్‌లో వ్యాయామం చేస్తాడో ఇట్టే తెలిసిపోతుంది. దీనికి గల కారణం డేన్ కుక్ తన జిమ్, ఫిట్ నెస్‌కి సంబంధించిన విషయాలను ఎక్కువగా ట్విట్టరో పోస్ట్ చేస్తుంటారు కాబట్టి. హావాయ్ బీచ్‌లో తన గర్ల్ ప్రెండ్‌తో మైమరచిపోతూ ముద్దు పెట్టుకున్న ఫోటో ఈ ప్రక్క చిత్రంలో మీరు చూడోచ్చు. ఈ నెల మొదట్లో తన ట్విట్టర్ పేజిలో డేన్ కుక్ నేను చాలా రోజుల తర్వాత మొదటి సారి ప్రేమలో పడ్డానని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











