పాఠకులకు ప్రత్యేకం ‘ఆస్కార్ ప్రిడిక్షన్స్ (జోస్యం)’
ఫిబ్రవరి 26, ఆదివారం ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తు్న ఆస్కార్ అవార్డ్స్ వేడుక ప్రముఖ హాస్య నటుడు బిల్లీ క్రిస్టేల్ చేతుల మీదగా ప్రారంభం కానున్నాయి. ప్రపంచం మొత్తం ఈ వేడుకలకు సిద్దమైంది. ఆదివారం రోజున ఈ బంగారపు బొమ్మను సొంతం చేసుకునే అదృష్టవంతులెవరో తెలుసుకోవడానికి అందరూ టీవికి అతుక్కు పోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే మరోవైపు హాలీవుడ్ నిపుణులు 'ఆస్కార్ ప్రిడిక్షన్స్ (జోస్యం)' పేరిట ఎవరు ఈ అవార్డ్‌ని సొంతం చేసుకుంటారనే కధనాలను ప్రచురిస్తున్నారు. అవేమిటో చూద్దాం...
ఉత్తమ చిత్రం: "ఆర్టిస్ట్"
ఉత్తమ దర్శకుడు: మైకేల్ హజనవిసియస్, "ఆర్టిస్ట్"
ఉత్తమ నటుడు: జీన్ డుజార్డిన్, "ఆర్టిస్ట్"
ఉత్తమ నటి: వియోలా డేవిస్, "ది హెల్ప్"
ఉత్తమ సహాయ నటి: ఓక్టావియా స్పెన్సర్, "ది హెల్ప్"
ఉత్తమ సహాయ నటుడిగా: క్రిస్టోఫర్ ప్లమ్మర్, "బిగినర్స్"
ఉత్తమ దర్శకుల విభాగంలో మైకేల్ హజనవిసియస్ (ది ఆర్టిస్ట్), అలెగ్జాండర్ పేనె (ది డిసెండెంట్స్), మార్టిన్ స్కోర్‌సెసె (హ్యూగో), వూడీ అలెన్ (మిడ్‌నైట్ ఇన్ పారిస్), టెర్రెన్స్ మల్లిక్ (ది ట్రీ ఆఫ్ లైఫ్)లు పోటీపడుతున్నారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో రూపొందిన నలుపు-తెలుపు చిత్రం 'ది ఆర్టిస్ట్'. మైఖేల్ హజనవిసియస్ ప్రతిభకు ఈ చిత్రం ఓ నిదర్శనం అని హాలీవుడ్ వర్గాలు కితాబులిచ్చేశాయి. అలాగే ఇదే చిత్రానికిగాను ఉత్తమ రచయిత, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాల్లో కూడా మైకేల్ నామినేషన్ సాధించారు.


Click it and Unblock the Notifications











