బ్రిట్నీ ఒంటరిగా మిగిలిపోవడానికి కారణం ఇదా..??

By Kuladeep

ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ వరల్డ్ టూర్ లో వుండగా తన ఏజెంట్, మిత్రుడు జాసన్ ట్రావిక్ ను ప్రేమిస్తున్నట్టు తెలిపింది. కానీ ట్రావిక్ ఆమె ప్రేమను ఒప్పుకోలేదు. కేవలం స్నేహితులుగా మిగిలిపోదామని చెప్పాడు. కానీ బ్రిట్నీ మాత్రం పట్టు వదలకుండా అతని ప్రేమకోసం పరితపించింది. ఆమె పట్టుదలతో చివరికి ట్రావిక్ ప్రేమను గెలుచుకుంది. ఆ తర్వాత ట్రావిక్ బ్రిట్నీ మాజీ భర్తను కలిసి తాను బ్రిట్నీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్పి, అందుకు అతని అనుమతి కూడా కోరాడు. దీంతో బ్రిట్నీ చాలా సంతోషించింది.

అంతా సజావుగా జరుగుతోంది అనుకుంటుండగా జాసన్ ట్రావిక్ బ్రిట్నీని వదిలేస్తూ ఆమె నెత్తిన బాంబు వేసాడు. ఇంతకీ అతను ఆమెను వదిలేయడానికి కారణం ఏంటా అని ఆరా తీస్తే బ్రిట్నీయే అని తేలింది. ట్రావిక్ చాలా సరదా మనిషట. అందరితోనూ ఇట్టే కలసిపోయే తత్వం అతనిది. అతనికి అబ్బాయిలు ఎంత మంది స్నేహితులున్నారో అమ్మాయిలు కూడా అంతే మంది ఉన్నారట. కానీ బ్రిట్నీకి ఇది సహించలేదు. జాసన్ తనతో కాకుండా ఇంకెవరితోనైనా సన్నిహితంగా మెలిగితే ఆమె తట్టుకోలేకపోయేది. అతని మీద ఉన్న అతిప్రేమే వల్లే ఈ విధంగా జరిగిందని తెలుసుకోలేకపోయిన ట్రావిక్ ఆమె జాగ్రత్తను ఆంక్షలుగా భావించాడు.

దీనికి తోడు ఇటీవల జాసన్ లాస్ ఏంజిల్స్ లోని ఓ బార్ లో బాగా మద్యం సేవించి ఇద్దరు అమ్మాయిలతో చాలా చనువుగా మెలుగుతూ కనిపించాడు. ఆ తర్వాత వారిద్దరిలో ఓ అమ్మాయితో కలసి కార్ లో తన ఇంటికి వెళ్లాడు జాసన్. ఇక్కడ మరో విషయం ఏంటంటే జాసన్ ఆ సమయంలో బ్రిట్నీ నుండీ వస్తున్న ఫోన్ కాల్స్ ను రిసీవ్ చేసుకోలేదట. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి బ్రిట్నీ చెవున పడింది. దీంతో ఆమె అగ్గిమీద గుగ్గిలం అయింది. తను ప్రేమించిన వాడు చేసిన మోసాన్ని భరించలేక అతన్ని ఈ విషయమై అడిగితే అతను వారు కేవలం నా స్నేహితురాళ్లు మాత్రమే అని ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేసాడు. కానీ ఆమె మానసిక స్థాతి బాగోకపోవడం వల్ల విపరీతంగా ప్రవర్తించింది. దీంతో ట్రావిక్ నేనిక ఆంక్షలను తట్టుకోలేనని చెప్పి ఆమెను వదిలేసాడట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X