ఆయనతో కలసి నటించే అవకాశం ఏ హీరోయిన్ వదులుకోదు
ఏంజిలినా జోలీ యావత్ హాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని ఏర్పరచుకున్నారు. 2010వ సంవత్సరంలో విడుదలైనటువంటి ది టూరిస్ట్ సినిమాకు సంబంధించినటువంటి కొన్ని అనుభవాలను, విశేషాలను ఆమె అభిమానులతో ఇలా పంచుకున్నారు. ది టూరిస్ట్ అనే సినిమాలో ఏంజిలినా జోలీతోపాటు హీరోగా పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ స్టార్ జానీ డెప్ నటించడం జరిగింది. ది టూరిస్ట్ సినిమాకు సంబంధించి సింహాభాగం మొత్తం షూటింగు ఇటలీలోనే తీయడం జరిగింది.
ఈ సందర్బంగా ఏంజిలినా జోలీ మాట్లాడుతూ జానీడెప్ లాంటి ఎక్ట్రాఆర్డినరీ హీరోతో రెండు నెలలుపాటు ఇటలీలో షూటింగ్ వదులుకోవడం ఇష్టం లేకనే నేను అతనితో ది టూరిస్ట్ సినిమాలో నటించడానికి అంగీకరించాను అన్నారు. నాకు చాలా మంది హీరోయిన్లు అలా రెండు నెలలు పాటు ఒకే హీరోతో షూటింగ్ చేయడానికి ఇష్టపడరు అన్నారు. కానీ జానీడెప్‌తో నటిస్తుంటే చాలా సరదాగా, ప్రేమగా ఉంటుందన్నారు. అందుకే నేను అతను నన్ను ఈసినిమాలో మీరు నటించాలి అని అడగగానే వెంటనే ఒప్పుకున్నాను.
ఇక జానీడెప్ విషయానికి వస్తే అతనిలాగా ఉండే హీరోను నేను ఇంతవరకు చూడలేదన్నారు. అతను చాలా బాగా పెయింగ్ వేస్తారు, పెయింటింగ్ తోపాటు మంచి మ్యూజిషియన్ కూడా. అందుకే అతనితో సినిమా చేస్తున్నంతకాలం నాకు చాలా సరదాగా ఉంది. ఇది మాత్రమే కాకుండా నటనలో కూడా జానీడెప్ మంచి నటుడు. ఇంతవరకు నేను కలసినటించిన వారిలో జానీడెప్ కూడా ఓ మంచి నటుడని అన్నారు.


Click it and Unblock the Notifications











