విదేశీ సినిమాలపై బాంబు పేల్చిన ట్రంప్.. భారతీయ చిత్రాలపై భారీ దెబ్బ?
అమెరికాలో నిర్మించని విదేశీ సినిమాలపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చాడు. అమెరికాలో కాకుండా ఇతర దేశాల్లో రూపొందించే సినిమాలపై 100 శాతం పన్ను విధించాలని ఆయన సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. అయితే హాలీవుడ్ సినిమా పరిశ్రమ చచ్చిపోతున్నది. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని ఆయన పేర్కొన్నారు. అయితే ట్రంప్ నిర్ణయం వల్ల భారతీయ సినిమాలకు ఎలాంటి ప్రతికూలత ఎదురవుతుందనే వివరాల్లోకి వెళితే..
అమెరికాలోనే సినిమాల నిర్మాణం జరగాలి. మళ్లీ హాలీవుడ్‌కు పూర్వ వైభవం రావాలి అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాలకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విదేశాల్లో నిర్మించే సినిమాలపై 100 శాతం పన్ను విధించాలి. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని తన ఆదేశాల్లో ఆయన పేర్కొన్నారు.

ట్రంప్ ఆదేశాలకు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించారు. తాము ఇప్పటికే ఈ పనులు ప్రారంభించాం. పన్ను విధింపు అవకాశాలను పరిశీలిస్తున్నాం అని ట్రంప్ ఆదేశాలకు అధికారులు బదులిచ్చారు. అయితే కేవలం థియేట్రికల్ రిలీజ్‌లపై పన్ను విధిస్తారా? లేదా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలపై కూడా పన్ను విధిస్తారా అనే విషయంపై అస్పష్టత నెలకొని ఉంది.
ట్రంప్ తీసుకొన్ని నిర్ణయంతో రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. సినిమా బడ్జెట్‌పై పన్ను విధిస్తారా? లేదా బాక్సాఫీస్ రెవెన్యూ ఆధారంగా పన్ను విధిస్తారా? అనే విషయాలపై క్లారిటీ లేదు. ఈ అంశాలపై హాలీవుడ్ సినీ వర్గాలు, అధికారులు ఉమ్మడిగా కసరత్తు చేస్తున్నారు అనే విషయాన్ని రాయటర్ వెల్లడించింది.
ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే హాలీవుడ్ సినిమా పరిశ్రమకు పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నాలను ప్రారంభించారు. హాలీవుట్ దిగ్గజాలు జాన్ వాయిట్, సిల్వెస్టర్ స్టాలోన్, మెల్ గిబ్సన్ లాంటి వారితో ఓ కమిటీని రూపొందించారు. ఇంతకుముందు కంటే భిన్నంగా, మెరుగ్గా సినీ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో భారతీ సినిమా పరిశ్రమ ఆదాయంపై భారీగా దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే ఈ వ్యవహారంపై భారతీయ సినీ వర్గాలు, నిర్మాతలు, దర్శకులు స్పందించలేదు. ట్రంప్ నిర్ణయంపై ఆర్థిక నిపుణుల సలహాలను తీసుకొంటున్నట్టు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











