జైల్లో చావు బతుకుల్లో ప్రముఖ నిర్మాత.. చేసిన నేరాలకు ఇంతకంటే ఘోరమైన శిక్ష ఉంటుందా?
హాలీవుడ్‌లో పలువురు మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రముఖ నిర్మాత, హాలీవుడ్ మొఘల్ హార్వే వెయిన్‌స్టెయిన్ వ్యవహారం అత్యంత దయనీయంగా మారింది. చావు బతుకుల్లో ఉన్న ఆయనపై వరుసుగా కేసులు నమోదు అవుతున్నాయి. 72 వయసులో కూడా ఆయన నేరాలు వెంటాడుతున్నాయి. అయితే అంతకు మించి ఆయన ప్రాణాంత వ్యాధికి గురయ్యారనే విషయం మరింత దారుణంగా మారింది. ఈ నిర్మాత ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
తారలపై బలత్కారం కేసులో కొన్నేళ్లుగా న్యూయార్క్ జైలులో శిక్ష అనుభవిస్తున్న హర్వేకు ఓ కేసులో దోషిగా తీర్పునివ్వడం ఆయన జైలు నుంచి బయటకు రావడానికి చేస్తున్న ప్రయత్నాలకు మరింత గండి పడింది. 2000 నుంచి 2016 వరకు ఆయన చేసిన లైంగిక దాడులపై కోర్టుకు సమర్పించిన మూడు బలమైన సాక్ష్యాల ఆధారంగా ఆయనను దోషిగా పరిగణించారు.

హర్వేపై ఇప్పటి వరకు హార్వేపై 100 మందికిపైగా మహిళలు అత్యాచారం, లైంగిక వేధింపులు, తప్పుగా బిహేవ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో తాను నిర్దోషినని న్యాయ పోరాటం చేస్తున్న ప్రయత్నాలకు అడ్డంకిగా మారింది. అయితే ఆయన ఆరోగ్యం కూడా విషమిస్తుండటంపై న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. వెయిన్‌స్టెయిన్‌కు తీవ్రమైన మైలాయిడ్ లుకేమియాతో బాధపడుతున్నట్టు వైద్యులు నిర్ధారించారు. దాంతో ఆయనను న్యూయార్క్‌లోని రైకర్ ఐలాడ్ జైలులోని హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. మూలుగలో తెల్ల రక్త కణాలు ఎక్కువగా ఉన్నాయని.. ఆయన బోన్ మ్యారో క్యాన్సర్ సోకిందని వైద్యులు వెల్లడించారు.

అయితే క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయనకు నెల క్రితం హార్ట్ సర్జరీ కూడా జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం రైకర్స్ నుంచి బెల్లెవ్యూ హాస్పిటల్‌కు తరలించాలని వైద్యులు కోరారు. గుండె ఆపరేషన్ జరిగినందున వైద్యుల పర్యవేక్షణ అత్యంత అవసరమని వెల్లడించారు.
గతంలో హర్వే కోవిడ్ పాజిటివ్‌కు గురయ్యారు. జైలులో న్యూమోనియాతో బాధపడ్డారు. మధుమేహం, హై బీపీ, వెన్నుముక, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తనకు క్షమాబిక్ష పెట్టి జైలు శిక్ష నుంచి విముక్తి చేయాలని ఆయన కోర్టును వేడుకొన్నారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు.


Click it and Unblock the Notifications