రాయల్ జంటను కలవనున్న ప్రఖ్యాత దర్శకుడు
హాలీవుడ్‌లో అత్యంత అధ్బుతమైన సినిమాలను తీసిన స్టార్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్‌ని రాయల్ జంట ప్రిన్స్ విలియమ్స్, కేట్ మిడిల్టన్‌లు మర్యాద పూర్వకంగా కలవనున్నారు. ప్రత్యేకించి స్పీల్ బర్గ్‌ని కలవడానికి కారణం, స్పీల్‌బర్గ్ కొత్తగా రూపొందించిన సినిమా 'వార్ హార్స్' ప్రీమియర్ షోకి వీరిద్దరూ అతిధులుగా హాజరుకానున్నారు. ఐతే స్పీల్‌బర్గ్‌ని మాత్రం రాయల్ జంట ఈ ప్రీమియర్ షోకి ముందుగానే కలవబోతున్నారని హాలీవుడ్ సమాచారం.
రాయల్ జంట కోసం స్పీల్‌బర్గ్ ప్రత్యేకించి జనవరి 8వ తారీఖున 'ఓడెన్ లెస్టర్ స్క్వేర్' లో ప్రత్యేకించి ప్రీమియర్ షో వేయనున్నారు. ఈ సందర్బంలో ఈ సినిమా యూనిట్ సభ్యులైన జెరెమి ఇర్విన్, టామ్ హిడిలస్టన్, ఎమిలీ వాట్సన్‌లను రాయల్ జంట పలకరించనున్నారు. ఈ ప్రీమియర్‌కి సుమారు 600 మిలిటరీ కుటుంబాలను ఆహ్వానించనున్నారు. దీని ద్వారా వచ్చిన డబ్బుని 'ప్రిన్స్ విలియమ్స్ అండ్ ప్రిన్స్ హ్యారీ' ఫౌండేషన్‌కి విరాళంగా అందించనున్నారు.


Click it and Unblock the Notifications











