మొదట సారి సినిమాలో కనిపిస్తున్నా...?

ఈ సందర్బంలో విల్ స్మిత్ మాట్లాడుతూ 'ఫోకర్ ఫేస్' సింగర్ అయినటువంటి పాప్ స్టార్ లేడిగాగా త్వరలో విడుదల కానున్న "మెన్ ఇన్ బ్లాక్3" సీక్వెల్‌లో ఓ గెస్ట్ రోల్‌ని పోషించారు. ఈ సినిమాలో జంట సెలబ్రిటీలు ఉన్నారు. కానీ వారు ఎవరనేది నేను బహిర్గతం చేయను. కానీ అభిమానులకు తప్పకుండా ఆశ్చర్యం కలిగేందుకు గాను ఈసినిమాలో లేడీ గాగా కనిపించనుందని అన్నారు.
గతయేడాది లేడిగాగా ఓ ఇంటర్యూలో తనకు సినిమాలో నటించాలని ఉన్న విషయాన్ని తెలియచేసిన విషయం తెలిసిందే. వూడీ అలెన్ సినిమా ద్వారా నా కల సాకారం అవనుందని గాగా అన్నారు. మెన్ ఇన్ బ్లాక్ రెండవ ఫిల్మ్‌లో దివగంత పాప్ స్టార్ మైఖెల్ జాక్సన్ నటించారు. ప్రపంచ వ్యాప్తంగా మే నెలలో విడుదల కానున్న "మెన్ ఇన్ బ్లాక్3" చిత్రం విలన్ రోల్‌ని నికోలే షెర్జింజర్ నటించారు. ఈ సినిమాలో ఏజెంట్ జె పాత్రను విల్ స్మిత్ నటించగా.. ఏజెంట్ కె పాత్రకు గాను లీ జోన్స్ నటించారు.


Click it and Unblock the Notifications











