»   » లైంగిక వేధింపుల కేసులో...ఆ నటుడిని విచారిస్తారా?

లైంగిక వేధింపుల కేసులో...ఆ నటుడిని విచారిస్తారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Will Robert De Niro be questioned in Tarun Tejpal case?
పనాజీ(గోవా): తెహల్కా పత్రిక ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. తాజాగా ఈ కేసులో ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ డి నీరోను కూడా పోలీసులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

ఆయనకు ఈ కేసులో సంబంధం లేక పోయినా....మహిళా జర్నలిస్టు తన ఫిర్యాదులో ఆయన పేరు కూడా పేర్కొనడం చర్చనీయాంశం అయింది. గోవాలో నవంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించిన థింక్ ఫెస్ట్ కార్యక్రమంలో రాబర్ట్ డి నీరో ప్రధాన వ్యక్తగా పాల్గొన్నారు. రాబర్ట్ డి నీరోతో సమావేశం అవ్వాలనే కారణంతోనే తేజ్ పాల్ మహిళా జర్నలిస్టును పిలిచి లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.

కాగా..తాను లైంగిక దాడికి పాల్పడలేదని, పరిహాసం కోసం సరదాగా అలా చేశానని మహిళా జర్నలిస్టుపై దాడి కేసులో నిందితుడైన తెహెల్కా వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్‌పాల్ కోర్టుకు చెప్పుకున్నాడు. ముందస్తు బెయిల్ కోసం పటిషన్ దాఖలు చేసిన తరుణ్ తేజ్‌పాల్ ఆ విధంగా చెప్పాడు.

అయితే, గత వారం యువతికి క్షమాపణలు చెబుతూ పంపిన ఈ మెయిల్ వాదనకు ఇది భిన్నంగా ఉంది. తాను సిగ్గుమాలిన అభిప్రాయానికి వచ్చి లైంగిక అనుసంధానం కోసం రెండు సార్లు ప్రయత్నించినందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు ఆయన ఆ ఈ మెయిల్‌లో అన్నారు.

సంఘటనను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నారని మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురిపై విమర్శలు చేస్తూ మహిళా జర్నలిస్టు తన ఉద్యోగానికి సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె రాజీనామాను యాజమాన్యం ఆమోదించింది. తనపై ముందస్తు పథకం ప్రకారం కుట్ర చేశారని తేజ్‌పాల్ ఆరోపించారు. తాను బిజెపి నేతల ఆగ్రహానికి బాధితుడిగా మారానని, గోవాలో బిజెపి ప్రభుత్వం ఉందని, గతంలో తాము బిజెపి నాయకుల అవినీతిని బయటపెట్టినందుకు తనపై కుట్ర చేశారని తేజ్‌పాల్ అన్నారు.

English summary

 Being put up in a VIP suite close to the elevator where Tehelka editor-in-chief Tarun Tejpal sexually assaulted a junior colleague appears to have put the media spotlight on Hollywood legend Robert De Niro, for no fault of his.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu