వాళ్శిద్దరూ కూడా బాక్సింగ్ ఛాంపియన్స్ అందుకే ఈఆఫర్ ఇచ్చాం..
ఓ బాక్సింగ్ ప్రమోటర్ సెలబ్రిటీ బాక్సింగ్ మ్యాచ్ నిర్వహిద్దామని అనుకోని హాలీవుడ్ సూపర్ స్టార్స్ అయినటువంటి విల్ స్మిత్, మార్క్ వాల్ బెర్గ్ లురింగ్ లోకి వస్తే వన్ మిలియన్ డాలర్లు ఇస్తానని బేరం కుదర్చుకున్నట్లు సమాచారం. ఇద్దరూ కూడా బాక్సింగ్ కుసంబంధించినటువంటి సినిమాలలో నటించారు కాబట్టే ఈనిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈవెంట్ ఆర్గనైజర్స్ తెలిపారు. మార్క్ వాల్ బెర్గ్ నటించినటువంటి ది పైటర్ సినిమా ఎన్ని బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేసిందో తెలిసిందే. అదేవిధంగా 2001లో విల్ స్మిత్ బాక్సర్ గానటించినటువంటి ఆలీ సినిమా ఇప్పటికీ విల్ స్మిత్ అభిమానలు చేత నిరాజనాలు అందుకుంటుంది.
అంతేకాకుండా హాలీవుడ్ లోఉన్నటువంటి ప్రోపెషనల్ బాక్సింగ్ పైటర్స్ వద్ద వీరు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. హాలీవుడ్ బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు డామన్ ఫెల్డ్ మన్ మాట్లాడుతూ వీరిద్దరి మద్య మూడు సార్లు వన్ మినిట్ రౌండ్లు ఉంటాయని స్పష్టం చేశారు. ఐతే ఈబాక్సింగ్ పోటీలో వీరిద్దరూ ప్రవర్తన ఎలాఉంటుందనేది చెప్పలేని పరిస్దితి. విల్ స్మిత్, మార్క్ వాల్ బెర్గ్ అభిమానులుగా వారిద్దరూ రింగ్ లోకి వచ్చి మాలాంటి అభిమానులకోసం ఒక్కసారైనా తలపడితే చూడాలనుందని అన్నారు. అంతేకాకుండా రింగ్ లోవారు చేసేటటువంటి కామెడీ చూడడానికి ముచ్చటగా ఉంటుందని అన్నారు. ఐతే మేము ఇచ్చినటువంటి ఆఫర్ కువిల్ స్మిత్, మార్కెట్ వాల్ ఇంకా వాళ్శ నిర్ణయాన్ని తెలపాల్సి ఉందని అన్నారు.


Click it and Unblock the Notifications











