Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
ఇష్టమైన సినిమాకు పని చేయడం ఎప్పుడూ ఇష్టమే
హాలీవుడ్ హీరోలలో విల్ స్మిత్ శైలి ప్రత్యేకం. ఎప్పుడూ కొత్తగా అభిమానులను అలరించాలనే తత్వం ఆయనది. అలాంటి స్టార్ హీరో విల్ స్మిత్, జాడా పింకెట్ ముద్దుల కుమార్తె "మాడగాస్కర్ 3 - యూరోప్ యొక్క మోస్ట్ వాంటెడ్" సినిమాలో కొత్తగా పరిచయం చేసిన ఓ క్యారెక్టర్‌కు గాత్రదానం చేసింది.
గతంలో రెండు భాగాలకు గాను విల్ స్మిత్ భార్య స్టార్ హీరోయిన్ జాడా పింకెట్ తన గాత్రాన్ని గ్లోరియా అనే క్యారెక్టర్‌కు అందించగా.. ఇప్పడు మూడవ భాగానికి తన కుమార్తె గాత్రం అందించడం తనకి చాలా సంతోషంగా ఉందని జాడా పింకెట్ తెలిపారు. విల్ స్మిత్ అధికార ప్రతినిధి ఈ విషయంపై మాట్లాడుతూ 'విల్లో'కి మడగాస్కర్ సినిమాలు చచ్చేంత ఇష్టం. తనకు నచ్చిన సినిమాలలో తన వాయిస్ చెప్పడం తనకు చాలా సంతోషంతో ఉన్నట్లు ఉందని తెలిపారు.
విల్ స్మిత్ కుమార్తె విల్లో ప్రస్తుత వయసు 11 సంవత్సరాలు. 'విప్ మై హెయిర్' అనే పాప్ సాంగ్ ద్వారా హాలీవుడ్‌కి పరిచయమైంది. యానిమేషన్ ఆధారంగా రూపొందించిన "మాడగాస్కర్ 3 - యూరోప్ యొక్క మోస్ట్ వాంటెడ్" సినిమాకు ఎరిక్ డార్నెల్, టామ్ మెగ్ గ్రాత్, కార్నెడ్ వరూన్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమాని డ్రీమ్ వర్క్స్ యానిమేషన్ యాజమాన్యం నిర్మిస్తుంది. ఇండియాలో ఈ సినిమాని జూన్ 8వ తారీఖున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.