twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హరిద్వార్‌లో సామాన్య భక్తుడిలా హాలీవుడ్ స్టార్.. 15 లక్షల మంది ఫిదా!

    |

    భారత దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో హరిద్వార్ ఒకటి. హిందువులు దేవతలా భావించే గంగా నదికి, పరమ శివుడికి ఇక్కడ నిత్యం పూజలందుతుంటాయి. నిత్యం భక్తులు వేల సంఖ్యలో హరిద్వార్ ని సందర్శిస్తుంటారు. చాలా మంది పాశ్చాత్త ప్రముఖులు భారత దేశ సంప్రదాయాల పట్ల ఆకర్షితులవుతుండడం మనం గమనిస్తూనే ఉన్నాం. పాశ్చాత్త దేశాలకు చెందిన క్రీడాకారులు, సినీ తారలు ఇండియాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలని సందర్శిస్తుంటారు. తాజాగా హాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన విల్ స్మిత్ హరిద్వార్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు.

    మా బామ్మ చెబుతూ ఉండేది

    మా బామ్మ చెబుతూ ఉండేది

    విల్ స్మిత్ తాను సందర్శించిన హరిద్వార్ పుణ్యక్షేత్ర ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. హరిద్వార్ పర్యటన గురించి విల్ స్మిత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. మా బామ్మ తరచుగా చెబుతూ ఉండేది. అనుభవం ద్వారానే భగవంతుడు మనకు అన్ని పాఠాలు నేర్పిస్తాడు అని. ఇండియా పర్యటన నాకు సరికొత్త అనుభవాన్ని ఇచ్చింది. కొత్త విషయాలు తెలుసుకున్నా. అని విల్ స్మిత్ తెలిపాడు.

    ప్రత్యేక పూజలు

    ప్రత్యేక పూజలు

    విల్ స్మిత్ హరిద్వార్ లో సామాన్య భక్తుడిగా పూజ కార్యక్రమాలు నిర్వహించాడు. గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నాడు. దేవాలయంలో కూర్చుని భక్తిశ్రద్దలతో హరిద్వార్ ప్రాముఖ్యతని తెలుసుకుంటున్నాడు. హరిద్వార్ గంగా నది ఘాట్ లో పుణ్య స్నానాలు ఆచరిస్తున్న ఫోటోలని కూడా పోస్ట్ చేశాడు. విల్ స్మిత్ పోస్ట్ చేసిన ఫొటోలకు విశేష స్పందన వస్తోంది.

     19 లక్షల మంది ఫిదా

    19 లక్షల మంది ఫిదా

    విల్ స్మిత్ ఈ ఫోటోలు పోస్ట్ చేసిన 24 గంటల్లోపే 15 లక్షల లైకులు వచ్చాయి. విల్ స్మిత్ భారత సంప్రదాయాల పట్ల చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలు చాలా మందితో విల్ స్మిత్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. విల్ స్మిత్ నటిస్తున్న తదుపరి చిత్రం జెనీ లో నటిస్తున్నాడు.

    హరిద్వార్ ఘాట్‌లో

    హరిద్వార్ ఘాట్‌లో

    విల్ స్మిత్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హారతిని హరిద్వార్ ఘాట్ లో విడిచిపెట్టాడు. ఈ దృశ్యం అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఓ ఆలయంలో సామాన్య భక్తుడిలా విల్ స్మిత్ కింద కూర్చుని ఉండగా ఓ వ్యక్తి అతడికి హరిద్వార్ ప్రాముఖ్యతని తెలియజేస్తున్నాడు.

    English summary
    Will Smith takes part in Ganga aarti at Haridwar. Will Smith has shared a series of new pictures and a video from Haridwar, where he took part in the Ganga aarti.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X