twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్త బాయ్ ప్రెండ్‌తో రొమాంటిక్ వీకెండ్..

    By Nageswara Rao
    |

    లండన్: హాలీవుడ్ చరిత్రలో మొట్టమొదటి సారి ఎక్కువ ఆస్కార్ అవార్డులు గెలుపొందిన చిత్రంగా 'టైటానిక్' సినిమాని అభివర్ణిస్తారు. ఈ సినిమాలో నటించిన నటనకు గాను హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రోడ్యూసర్, నిర్మాత ఇలా అందరికి ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ పేరు కేట్ విన్స్‌లెట్. ఈ పేరుని ఎలా మరిచిపోతాం అని అనుకుంటున్నారా.. తన అందంతో ఈ సినిమాలో యావత్ ప్రపంచాన్నే కట్టిపడేసింది.

    సాధారణంగా హీరోయిన్లు తమ అందాలను ప్రదర్శించడానికి చాలా సిగ్గు పడుతుంటారు. కానీ మన కేట్ విన్స్‌లెట్ మాత్రం ఎప్పుడెప్పుడూ తన అందాలను అభిమానులకు చూపిద్దామా అని ఎదురు చూస్తుందనడానికి మీకు రెండు ఉదాహారణలు చెబుతాను. మొదటిది టైటానిక్ సినిమాలో తన అందాలను ఏవిధంగా చూపించిందో మరవకు ముందే ఇటీవల కాలంలో 'రీడర్' అనే సినిమాలో కూడా ఒక స్కూల్ పిల్లాడితో డేటింగ్ చేసి ఈ సినిమాకి కూడా ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. అదేంటో గానీ కేట్ విన్స్‌లెట్ ఏ సినిమాలో అందాలను చూపితే ఆ సినిమాకి ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంటుంది.

    అలా కేట్ విన్స్‌లెట్ సినిమాల్లోనే కాదండోయ్ నిజ జీవితంలో కూడా చాలా ఈజీగా డేటింగ్స్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా డేటింగ్ ప్రారంభించింది ఎవరితో అని అనుకుంటున్నారా.. బ్రిటిష్ బిజినెస్ టైకూన్ రిచర్డ్ బ్రాన్సన్ తమ్ముడి కుమారుడు నెడ్ అబల్ స్మిత్‌తో.. వీరిద్దరిని జంటగా చూసిన జనాలు కేట్ ప్రక్కనుండే స్మిత్ చాలా ఆనందంగా ఉన్నాడని ప్రశింస్తున్నారు.

    కేట్, స్మిత్ ఇద్దరూ కలసి వీకెండ్స్‌ని ఇంగ్లీషు కంట్రీ సైడ్‌లో ఎంజాయ్ చేస్తున్నారని సమాచారం. కేట్ పెద్దది కావడం వల్ల తన వద్ద నుండి స్మిత్ చాలా విషయాలు నేర్చుకుంటున్నాడంట. ఇక కేట్ విన్స్‌లెట్ గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. మొట్టమొదటి పెళ్లి 1998లో డైరెక్టర్ జిమ్ థెప్లాటన్‌ని చేసుకోగా కొన్ని కారణాల వల్ల 2001లో అతని నుండి విడాకులు తీసుకొవడం జిరిగింది. రెండు సంవత్సరాల తర్వాత డైరెక్టర్ శ్యామ్ మెండిస్‌ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే శ్యామ్ మెండిస్ నుండి కూడా విడాకులు తీసుకొవడం జరిగింది.

    English summary
    Kate Winslet has found a new love — she is reportedly dating British business tycoon Richard Branson’s nephew Ned Abel Smith, also known as Ned Rocknroll.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X