మంచి షేపులు కలిగి ఉండడం నిజంగా అదృష్టం
టైటానికి సినిమా ద్వారా యావత్ ప్రపంచం మొత్తాన్ని తన అందాలతో కట్టి పడేసిన స్టార్ హీరోయిన్ కేట్ విన్స్‌లెట్. ఆస్కార్ విన్నింగ్ హీరోయిన్ అయిన కేట్ విన్స్‌లెట్ ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ ఆడవారికి అందమే ప్రధాన ఆకర్షణగా పేర్కోన్నారు. శరీరాన్ని మంచి షేపులతో ఉంచుకొవడమే కాకుండా, మన ఫిజక్‌కి నప్పేటటువంటి బట్టలను వేసుకున్నప్పుడే దానికొక అందం అని అన్నారు.
35 సంవత్సరాలు వయసు కలిగిన కేట్ విన్స్‌లెట్ ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ కూడా తన అందాన్ని చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. నా శరీరం విషయంలో మాత్రం నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. ఇంకా చెప్పాలంటే నా బాడీలో ఎక్కడెక్కడ షేపులు, కర్వ్‌లు అక్కడ మాత్రమే ఉన్నాయి. ఇది నేను ఆనందించతగ్గ విషయం అని అన్నారు.
నా శరీరం స్వతహాగా అలా షేపులు రావడానికి కారణం మా తల్లి జీన్సే కారణమని నేను అనుకుంటున్నానని అన్నారు. నా షేపులను, కర్వ్‌లను నేను చాలా చక్కగా ఆస్వాదించగలుగుతున్నాను. ఇక్కడ అభిమానులకు ఒక విషయం చెప్పాలి. అదేటంటే షేపులు ఉండడం ముఖ్యం కాదు, ఆ షేపులకు తగ్గ బట్టలు వేసుకున్నప్పుడే మనం చక్కగా ఎక్స్ పోజ్ చేయగలుతామని అన్నారు. కేట్ విన్స్‌లెట్‌కి ఇద్దరు పిల్లలు. ఒకరు తన మొదటి భర్త జిమ్ థెరాపల్టన్ ద్వారా జన్మనివ్వగా, మరో బిడ్డకి ప్రముఖ దర్శకుడు శ్యాంమెండిస్ ద్వారా జన్మనిచ్చారు.


Click it and Unblock the Notifications











