మూత్రం పోయడానికి కూడా వీల్లేని పరిస్థితి... దేవుడిని వేడుకున్న హాట్ బ్యూటీ!
న్యూయార్కులో జరుగుతున్న మెట్ గాలా 2019 వేడుకలో అమెరికన్ బ్యూటీ కిమ్ కర్దాషియాన్ కళ్లు చెదిరే లుక్‌లో దర్శనమిచ్చింది. ఈ వేడుకకు ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్ మన్ఫ్రెడ్ థియేరీ మగ్లర్ రూపొందించిన వెట్ డ్రెస్(తడిచిన గౌను)లో ఆమె హాజరయ్యారు.
అయితే వెట్ డ్రెస్సులో ఆమె లుక్ మేకోవర్ చేయడానికి చాలా సమయం పట్టిందట. దాంతో పాటు వెట్ లుక్ కనిపించడానికి కొన్ని రకాల జిగురు పదార్థాలు పూసి దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత కూర్చోవడం అస్సలు కుదరదు. శరీరాన్ని శిల్పంలా బిగబట్టినట్లు ఉంచాల్సి ఉంటుందట.

మూత్రం పోయడానికి కూడా వీలులేని పరిస్థితి
ఈ వెట్ డ్రెస్ వేసుకుని దాదాపు 4 గంటల పాటు ‘మెట్ గాలా 2019' వేడుకలో గడపాల్సి ఉంటుంది. మధ్యలో మూత్ర విసర్జన చేయడానికి కూడా వీలు లేదు. అలా చేయాల్సి వస్తే డ్రెస్ షేప్ దెబ్బతింటుంది. ఈ వేడుకకు వెళ్లే ముందు కిమ్ ఓ వీడియోలో మాట్లాడుతూ.... ‘‘నాలుగు గంటల పాటు మూత్ర విసర్జన కూడా చేయడం వీలు కాదు, విష్ మి లక్'' అంటూ వ్యాఖ్యానించారు.

వర్షంలో తడస్తూ వస్తున్న దేవతలాగా...
‘మెట్ గాలా 2019' వేడుకలో కిమ్ కర్దాషియాన్ ధరించిన డ్రెస్ చూసి అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. వర్షంలో తడస్తూ వస్తున్న దేవతలా ఆమె దర్శనమిచ్చారు. వాన చినుకులు పడుతున్న ఎఫెక్ట్ కనిపించేలా ప్రత్యేకంగా ఈ డ్రెస్ డిజైన్ చేశారు.

8 నెలలు కష్టపడి డిజైన్ చేశాడు
ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్ మన్ఫ్రెడ్ థియేరీ మగ్లర్ దాదాపు 8 నెలల పాటు కష్టపడి ఈ డ్రెస్ డిజైన్ చేశారట. గత 20 ఏళ్లలో ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్ కలిగిన డ్రెస్ ఎవరూ డిజైన్ చేయలేదని, ‘మెట్ గాలా 2019'లో అన్నింటికంటే హైలెట్ అయిన డ్రెస్ ఇదే అని అంటున్నారు.

కిమ్ కర్దాషియాన్ సెక్సీ ఫిజిక్
మన్ఫ్రెడ్ థియేరీ మగ్లర్ డిజైన్ చేసిన డ్రెస్సుకు మరింత వన్నె తెచ్చేలా కిమ్ కర్దాషియాన్ తన సెక్సీ ఫిజిక్‌తో ఆకట్టుకుంది. సన్నని నడముతో పాటు.... నడుము కింది భాగం, పై భాగంలో ఊరించే అందాల సంపదతో కిమ్ కర్దాషియాన్ చూపరుల మతి పోగొట్టింది.


Click it and Unblock the Notifications











