అతను కలిశాక వేరే వారితో సరసాలు మానేశా..!
హాలీవుడ్ పాప్ స్టార్ సెలెనా గోమెజ్ ఇటీవల ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ తన బాయ ప్రెండ్ జస్టిన్ బైబర్‌తో "గేమ్స్ ప్లే" చేయడం పూర్తిగా ఆపివేశానని అన్నారు. డిసెంబర్, 2010 నుండి 'బేబీ' అయినటువంటి జస్టిన్ బైబర్‌తో 19 సంవత్సరాల వయసు కలిగిన సెలెనా గోమెజ్ డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
గతంలో నేను చాలా మందితో గేమ్స్ ఆడాను. కానీ నా జీవితంలో నాకు నచ్చిన వ్యక్తి.. నేను ఎవరితోనైతే జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటున్నానో అలాంటి వ్యక్తి దొరికినప్పుడు ఇలాంటివటన్నింటికి స్వస్తి చెప్పాలని అన్నారు. ఒకవేళ ఎప్పుడైనా మీరు గేమ్స్ ఆడాల్సి వస్తే.. మీరు మీ ఆత్మరాత్మను ఒకసారి పరీక్షించుకోవాలని అన్నారు. ఐతే నేను గతంలో బైబర్‌తో ప్లే చేసిన గేమ్స్ ఇప్పడు నాకు చాలా సిల్లీగా ఉన్నాయని అన్నారు.
గతంలో నేను చాలా మందిని ఇష్టపడినప్పటికీ.. ఎవరితో కూడా హాద్దులు దాటలేదని అన్నారు. ఎవరితోనైనా సన్నిహితంగా ఉన్నానంటే అది కేవలం ఎంజాయ్ చేసేంతవరకే పరిమితం. మీతో ఓ ఉత్తమ వ్యక్తి కలసి ఉన్నప్పడు మీకు వేరే వారి గురించి ఆలోచించాల్సి పని ఉండదని తాను ప్రస్తుతం అటువంటి ఉత్తమమైన వ్యక్తితోనే ఉంటున్నానని బైబర్ గురించి తెలిపారు.


Click it and Unblock the Notifications











