ఉత్తమ సహాయ నటి: ఆస్కార్ ప్రిడిక్షన్స్
ఫన్నీ మ్యాన్ 63 సంవత్సరాల వయసు కలిగిన 'బిల్లీ క్రిస్టెల్' ఫిబ్రవరి 26 (ఆదివారం) నాడు తొమ్మిదోసారి ఆస్కార్స్‌కి ఆతిథ్యం ఇవ్వనున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది వీక్షించనున్న ఈ అకాడమీ అవార్డుల కార్యక్రమానికి తాను హోస్ట్‌గా వ్యవహారించడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇక 2012 ఉత్తమ చిత్రం విభాగంలో ది ఆర్టిస్ట్, హ్యూగో, ది డిసెండెంట్స్, ఎక్స్‌ట్రీమ్లీ లౌడ్ అండ్ ఇన్ క్రెడిబ్లీ క్లోజ్, ది హెల్ప్, మనీ బాల్, వార్ హార్స్, మిడ్‌నైట్ ఇన్ ఫారిస్, ది ట్రీ ఆఫ్ లైప్ చిత్రాలు ఆస్కార్ బరిలో నిలిచాయి.
సాధారణంగా ఆస్కార్ అవార్డుల ఫంక్షన్‌లో హీరో, హీరోయిన్‌తో పాటు మరో కొంత మంది కీలక పాత్ర పోషిస్తారు. వారే ఉత్తమ సహాయనటి, ఉత్తమ సహాయనటుడు. ఈ విభాగాలలో మొత్తం ఐదుగురు పోటీ పడుతున్నారు. ఉత్తమ సహాయనటి విభాగంలో ఆక్టేవియా స్పెన్సర్ ముందు ఉన్నారు. చూడాడనికి సుమారుగా ఉన్నప్పటికీ ది హెల్ప్ సినిమాలో ఆక్టేవియా స్పెన్సర్ చేసిన అభినయం వర్ణాతీతం అంటున్నారు ప్రేక్షకులు. ది హెల్ప్ సినిమాలో మిన్నీ జాక్సన్ అనే పాత్రలో చేసిన నటనకు గాను ఆక్టేవియా స్పెన్సర్ ఆస్కార్ నామినేషన్ పొందారు.
ఇక సినిమా విషయానికి వస్తే నల్ల జాతికి చెందిన మహిళ మిన్నీ జాక్సన్ పనిమనిషిగా చేస్తుంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్వం కలిగిన మిన్నీ జాక్సన్ ఇబ్బందులు పాలవుతుంది. ఈ పాత్రలో ఆమె ఒదిగిన తీరు ఆమెకు ఆస్కార్ కాకుండా ఇప్పటికే 10 అవార్డు లను సొంతం చేసుకుంది. ఈ రినైస్ బెజో, ది హెల్ప్ కి 'జెస్సికా చస్టయిన్', బైడ్స్ కి 'మెల్లిసా మెక్ కార్తీ', ఆల్బర్ట్ నాబ్స్ చిత్రానికి గాను 'జానెట్ మెక్ తీర్'లు బరిలో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ విశ్లేషకులు అంచనా ప్రకారం ఉత్తమ సహాయ నటి అవార్డు ఆక్టేవియా స్పెన్సర్ కే వస్తుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











