మూడో బిడ్డకు జన్మనిచ్చిన వండర్ ఉమెన్.. అదిరిపోయేలా ప్రియాంక చోప్రా రియాక్షన్స్
అందం, అభినయంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న వండర్ ఉమెన్ ఫేమ్ గాల్ గ్యాడట్ అభిమానులకు సంతోషకరమైన వార్తను తన సోషల్ మీడియా అకౌంట్‌లో వెల్లడించింది. తాను ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు. మూడోసారి తల్లిగా మారిన గాల్ గ్యాడట్‌కు సినీ ప్రముఖులు అభినందనల్లో ముంచెత్తారు. గాల్ గ్యాడెట్ ఇన్స్‌టాగ్రామ్ పోస్టు గురించి వివరాల్లోకి వెళితే..

36 ఏళ్ల వయసులో మూడోసారి
సూపర్ హీరోగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకొంటున్న 36 ఏళ్ల గాల్ గ్యాడట్ ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందిస్తూ.. నా స్వీట్ ఫ్యామిలీకి ఎంతో రుణపడి ఉంటాను. మూడో సంతానంతో సంతోషంగా ఉండటంతోపాటు అలిసిపోయాను. మా ఫ్యామిలీలోకి డానిల్లాను స్వాగతించాం. మీరందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకొంటున్నాను అని గాల్ గ్యాడట్ పోస్టులో పేర్కొన్నారు.

ప్రియాంక చోప్రా విషెస్ వైరల్
మూడో బిడ్డకు జన్మనిచ్చిన గాల్ గ్యాడట్‌కు ప్రియాంక చోప్రాతోపాటు పలువురు హాలీవుడ్ ప్రముఖులు అభినందనలు తెలిపారు. కంగ్రాట్యులేషన్ అంటూ హార్ట్ సింబల్‌తో కూడిన ఎమోజీతో ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు భర్త యారోన్‌తో దిగిన ఫోటోను ట్యాగ్ చేశారు.

ముగ్గురు ఆడపిల్లలకు తల్లిగా
గాల్ గ్యాడట్ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఇజ్రాయెల్‌కు చెందిన ఈ నటి 2008లో రియల్ ఎస్టేట్ వ్యాపారి యారోన్ వార్సానోను వివాహం చేసుకొన్నారు. ఈ దంపతులకు 2001లో మాయా అనే కూతురు, 2017లో ఆల్మా అనే మరో కూతురు జన్మించారు. తాజాగా 2021 జూన్ 29 తేదీన మూడో బిడ్డ డానిల్లాకు జన్మనిచ్చారు.

మిస్ ఇజ్రాయెల్‌గా సినీ రంగంలోకి
గాల్ గ్యాడట్ ప్రొఫెషనల్ లైఫ్‌లోకి వెళితే.. మిస్ ఇజ్రాయెల్ టైటిల్ గెలుచుకొన్న ఆమె 2009లో హాలీవుడ్‌లోకి ప్రవేశించారు. సంచలన విజయం సాధించిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రంలో జిసెలె యాషర్ అనే పాత్ర ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత వండర్ ఉమెన్ చిత్రంతో పాపులారిటీని సాధించారు. బ్యాట్‌మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్: డాన్ ఆఫ్ జస్టిస్, వండర్ ఉమెన్ 1984, జాక్ స్నైడర్స్ జస్టిస్ లీగ్ చిత్రాల్లో నటించి మెప్పించారు.

గాల్ గ్యాడట్ సినీ కెరీర్ ఇలా...
2021లో విడుదలైన జాక్ స్నైడర్స్ జస్టిస్ లీగ్ తర్వాత ప్రస్తుతం రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. రెడ్ నోటీస్, డెత్ అన్ ది నైల్ అనే చిత్రాల్లో కీలక పాత్రలను పోషిస్తున్నారు. టెలివిజన్‌లో కోవిడ్ ఈజ్ నో జోక్, క్లాస్ ఆఫ్ 2020: ఇన్ దిస్ టైగర్ చిత్రాల్లో నటించింది. ఇంకా మ్యూజిక్ వీడియోలు, బ్యూటీ కాంటెస్ట్‌కు సంబంధించిన ఈవెంట్లలో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











