రాయల్ వెడ్డింగ్ కోసం ఆస్టార్ డైరెక్టర్ కూడా ఇన్విటేషన్ అడిగారా..
వూడి అలెన్ హాలీవుడ్ లోచాలా పేరున్న గోప్ప డైరెక్టర్. వూడి అలెన్ ఎక్కువగా సెక్స్ కామెడీ సినిమాలు తీశారు. తనకుతానే స్టోరీలు రాసుకోని తీసినటువంటి సినిమాలు చాలా అధికం. హాలీవుడ్ లోఆయన తీయని సినిమాలు లేవు. లిటరేచర్, సెక్సువాలిటీ, సైకాలజీ, జ్యూయిస్ ఐడెంటికీ సంబంధించిన సినిమాలు చాలా తీశారు. జాజ్ క్లిలారినెట్ ద్వారా తన సోంత పట్టణం అయినటువంటి మాన్ హాట్టన్ లోఉన్న చిన్న చిన్న స్టేజీలపై ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా జాజ్ ఫెస్టివల్స్ జరిగేటప్పుడు వూడి అలెన్ లేని జాజ్ ఫెస్టివల్స్ లేవంటే నమ్మండి. అలాంటి మహాన్నతమైన వ్యక్తికి హాలీవుడ్ ఎన్నో సత్కారాలు, సన్మానాలు చేసి సత్కరించింది. ఇక వూడి అలెన్ తీసుకున్నటువంటి అవార్డులు సంఖ్య లెక్కకు మించినది.
అలాంటి మహాన్నతమైన వ్యక్తికి తన జీవితంలో చివరగా రాయల్ వెడ్డింగ్ చూడాలని అనిపించిందంట. న్యూయార్క్ డిన్నర్ పార్టీలో కలసినటువంటి ప్రిన్స్ ఆండ్రూని ప్రిన్స్ విలియమ్స్ పెళ్శికి తనను ఆహ్వానించవలిసిందిగా కోరారు. అంతేకాకుండా తనకోక ఇన్విటేషన్ కూడా పంపించవలసిందిగా కోరారంట. దీనికి గాను ప్రిన్స్ ఆండ్రూ మాత్రం తనదైన శైలిలో ఓచిన్న నవ్వు నవ్వి ఊరుకున్నారంట. దీంతో వూడి అలెన్ నాకు రాయల్ వెడ్డింగ్ చూసే అవకాశం వచ్చిందంటూ ఆనందంలో మునిగితేలుతున్నాడంట.
2011వ సంవత్సరంలో ఎంతో కాలంగా ప్రేమించుకున్నటువంటి ప్రిన్స్ విలియమ్స్, కేట్ మిడిల్డన్ లవివాహాం జరగనున్న విషయం అందిరికి తేలిసిందే. ఈపెళ్శికి ప్రపంచం నలుమూలల నుండి ఎంతో మంది ప్రముఖవ్యక్తులు రానున్న విషయం కూడా తెలిసిందే. కోన్నిసంవత్సరాల కాలం తర్వాత జరగనున్న ఈరాయల్ వెడ్డంగ్ కోసం ప్రపంచం నలుమూలల ఉన్నటువంటి రాయల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి అందరికి తెలిసిందే.


Click it and Unblock the Notifications











