twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా‌కు కారణం 5జీ టవర్లే.. బాంబు పేల్చిన హాలీవుడ్ స్టార్ ఊడీ హారెల్సన్.. పరిశోధకుల ఫైర్

    |

    కరోనావైరస్‌తో ప్రపంచం వణికిపోతుంటే హాలీవుడ్ యాక్టర్ భారీ బాంబు పేల్చాడు. అసలు కరోనావైరస్ అస్థిత్వం ఏమిటనే ప్రశ్నకు సమాధానాలు వెతుకుతున్న పరిశోధకులకు ఈ యాక్టర్ మరో చిక్కు ప్రశ్న వదిలాడు. భయాందోళనల మధ్య బతుకుతున్న ప్రజలు తాజాగా హాలీవుడ్ యాక్టర్ చేసిన కామెంట్లు, పోస్టులపై దృష్టిసారించారు. కరోనావైరస్‌కు అసలు కారణం అదే అంటూ నటుడు ఊడీ హారెల్సన్ విసిరిన బాంబు ఏమిటంటే..

    దుమారం లేపిన ఊడీ పోస్టు

    దుమారం లేపిన ఊడీ పోస్టు

    కరోనావైరస్‌కు 5జీ నెట్‌వర్క్‌కు సంబంధం అంటగడుతూ హాలీవుడ్ యాక్టర్ హారెల్సన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి. కొవిడ్19 వ్యాధి వ్యాప్తికి అసలు కారణం 5జీ వైర్‌లెస్ నెట్‌వర్క్స్ అంటూ చేసిన పోస్టు కొద్ది సేపట్లోనే వైరల్ అయింది. అయితే ఈ పోస్టుపై కొందరు స్పందిస్తూ.. బొడిగుండుకు మోకాలుకు లింకు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

    కరోనాకు అసలు కారణం

    కరోనాకు అసలు కారణం

    కరోనావైరస్‌కు అసలు కారణం 5జీ వైర్‌లెస్ నెట్‌వర్క్స్ ఊడీ హారెల్సన్ షేర్ చేసిన పోస్టులో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చైనాలో వుహాన్ తొలి 5జీ స్మార్ట్ సిటీగా ఎంపికైంది. దాంతో ప్రపంచంలోనే తొలి 5జీ స్మార్ట్ హైవేగా పేరుతెచ్చుకొన్నది. అంతలోనే వుహాన్‌లో ప్రాణాంతక వ్యాధి కరోనావైరస్ గణనీయంగా వ్యాప్తి చెందింది అని ఊడీ హారెల్సన్ షేర్ చేసిన రిపోర్టులో వెల్లడైంది.

    అక్టోబర్ 31నే చర్చ

    అక్టోబర్ 31నే చర్చ

    ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో 5జీకి, కరోనాకు సంబంధం ఏమిటనే దిశగా అక్టోబర్ 31వ తేదీనే తొలి చర్చ జరిగింది. ఈ చర్చపై 5జీ స్మార్ట్ సిటీ వుహాన్ ప్రాణాంతక వ్యాధి కరోనాకు నిలయం అనే విధంగా కథనాలు ప్రచురితమయ్యాయి. ఆ తర్వాత ఊడీ హారెల్సన్ షేర్ చేసిన రిపోర్టుపై విపరీతమైన చర్చ జరిగింది. అందులో అనేక సందేహాస్పద అంశాలు ఉండటంతో రిపోర్టు వాస్తవమెంత అనే దిశగా ఆలోచనలు ప్రారంభమయ్యాయి.

    సోషల్ మీడియాలో దాడి

    సోషల్ మీడియాలో దాడి

    ఇలాంటి పరిస్థితుల్లో ఊడీ హారెల్సన్ ఓ వీడియోను రిలీజ్ చేసి 5జీ నెట్‌వర్క్‌ టవర్స్ గురించి మాట్లాడటం మరింత ఆసక్తిని రేపింది. ఈ క్రమంలో పలువురు ఊడీ హారెల్సన్‌ చేసిన పోస్టుపై కొందరు నిపుణులు సోషల్ మీడియాలో దాడి చేయడం, కరోనాకు 5జీకి సంబంధం లేదని బల్లగుద్ది చెప్పడం మరింత చర్చనీయాంశమైంది.

    Recommended Video

    Salman Khan Clash with Jackie Shroff for Sangeeta Bijlani Now Goes Viral
    వివాదంతో పోస్టు తొలగింపు

    వివాదంతో పోస్టు తొలగింపు

    ఈ క్రమంలో ఊడీ హారెల్సన్ తన పోస్టును అనూహ్యంగా తొలగించాడు. తన పోస్టు వివాదానికి కేంద్ర బిందువుగా కావడం, అలాంటి వాదనకు సరైన సమాచారం లేకపోవడంతో తన పోస్టును డిలీట్ చేసి ఉంటాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే చివరకు ఇలాంటి అధ్యయనాలు కుట్రపూరితమైందని, అవగాహన లేని స్టడీ అంటూ ధ్వజమెత్తుతున్నారు.

    English summary
    Hollywood star Woody Harrelson suspects 5G wireless is the reason for Corona. Wuhan, the capital of Hubei province in China, was chosen to be China's first 5G 'smart city'. Wuhan is also the centre of horrendous coronavirus epidemic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X