రియల్ సెక్స్ సీన్‌కు రెడీ అంటున్న స్టార్ హీరో
లాస్ ఏంజిల్స్ : అవసరం అయితే కెమెరా ముందు రియల్ గా సెక్స్ సీన్‌లో నటించేందుకు రెడీ అంటున్నాడు హాలీవుడ్ స్టార్ జేమ్స్ ఫ్రాంకో. ఇటీవల ఆయన నటించిన సినిమాలు సెక్స్ నేపథ్యం ఉండటంతో ఇటీవల ఆయన్ను ఓ ఇంటర్వ్యూలో మీడియా వారు ప్రశ్నించగా.....పై విధంగా స్పందించారు. సీన్ డిమాండ్ చేస్తే నిజంగా సెక్స్ సీన్లో పాల్గొంటానని తేల్చి చెప్పాడు.
అయితే జేమ్స్ ఫ్రాంకో వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జేమ్స్ ఫ్రాంకో వ్యాఖ్యలు ఫోర్న్ చిత్రాలను ప్రోత్సహించినట్లు ఉందని, రియల్ గా సెక్స్ సీన్లు చేయడం అంటే ఫోర్న్ సినిమాలు చేయడమే అనేది చాలా మంది వాదన. అలాంటి ఉద్దేశ్యం ఉంటే ఫోర్న్ సినిమాల్లో నటించాలని పలువురు సూచిస్తున్నారు.
ఇటీవల కూడా జేమ్స్ ఫ్రాంకో ఆసక్తికరమైన ప్రకటనలతో వార్తల్లోకెక్కారు. డు. ఎవరైనా అతన్ని 'గే' అని భావిస్తే ఆయన అస్సలు బాధ పడడట. అలా అని ఆయన నిజంగానే 'గే' అనుకుంటే పొరపాటే. ఆయనపై ఇలాంటి రూమర్లు ఇప్పుడు కాదు... హైస్కూల్ రోజుల నుంచే ఉన్నాయట. అలా ఆ రూమర్లు విని విని అలవాటయిపోయిందని అంటున్నాడు జేమ్స్ ఫ్రాంకో.
జేమ్స్ ఫ్రాంకో నటించిన సినిమాలు గురించిన వివరాల్లోకి వెళితే....'రైస్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్', 2002లో వచ్చిన స్పైడర్ మేన్ చిత్రంలో జేమ్స్ ఫ్రాంకో నటించాడు. ఈ సినిమాలో హీరో పీటర్ పాత్రకు స్నేహితుడిగా హారీ అస్బార్న్ పాత్రలో జేమ్స్ ఫ్రాంకో నటించాడు. ప్రస్తుతం జేమ్స్ ఫ్రాంకో దిస్ ఈజ్ ది ఎండ్, లవ్ లేస్, చైల్డ్ ఆఫ్ గాడ్, హోం ఫ్రంట్ అనే హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











